ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎడిటోరియల్

పిల్లలు అడిగిందల్లా ఇచ్చి వారి ప్రాణాలు తీస్తున్న తల్లి తండ్రులు…

Parents and Children
పిల్లలు అడిగిందల్లా ఇచ్చి వారి ప్రాణాలు తీస్తున్న తల్లి తండ్రులు...

అజారుద్దీన్ ,కోటా శ్రీనివాస్ , బాబు మోహన్ , కోమటి రెడ్డి , తాజాగా నారాయణ పుత్రులను కోల్పోయిన తీరు అత్యంత విషాదం…

ఇది అందరి తల్లి తండ్రులకు ఒక గుణ పాఠం కావాలి …

మన పిల్లల వయస్సు ఎంత వారికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు . వారేం చేస్తున్నారు .ఎలా వుంటున్నారు . ఎవరితో ఎక్కడ తిరుగుతున్నారు . ఇవన్నీ తల్లితండ్రులు ప్రధానంగా చూసుకోవాలిసిన బాధ్యతలు

అవన్నీ నేడు సెలబ్రేటీలుగా బిజీ లైఫ్ గడిపే వారికి ఏ మాత్రం పట్టడం లేదు . కుటుంబం కన్నా డబ్భు పేరు ప్రఖ్యతలే వారికి కావాలిసింది . తమ పిల్లలు ఏది అడిగినా ఇచ్చే స్థాయి తమకి ఉందని వారి యువరక్తానికి ఇవ్వకూడని వాహనాలను యమ పాశాల్లా అందిస్తున్నారు . ఫలితం ఏమౌతుంది . ఇలా మృత్యు మృదంగాలు మ్రోగి జీవితకాలం బాధపడే పరిస్థితి కొనితెస్తుంది

ఇది ఒక నారాయణ కుటుంబానికే కాదు సంఘానికీ సమాజానికీ కూడా మంచిది కాదు

అత్యంత ఖరీదైన వాహనాలు , ఎంతటి వేగాన్ని అయినా అందుకునే స్పీడ్ కుర్రకారుకి దక్కితే వారి చేతులు ఎందుకు వూరుకుంటాయి ???.

అన్ని రోజులు మనవి కావు మితిమీరిన వేగంతో ఈ ఏడాది జనవరి , మార్చి లో సైతం నారాయణ కుమారుడి వాహనం 150 కిలోమీటర్ల స్పీడ్ లో వెళుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిఘా కెమెరాలకు చిక్కింది.

ఆ తరువాత వారు ఈ చలాన్లు పంపినా కట్టింది లేదు. కనీసం ఇలా తన కుమారుడు డ్రైవ్ చేస్తున్న సంగతి మంత్రి నారాయణ వరకు చెప్పే ధైర్యం ఏ ఒక్కరు చేసింది లేదు . చలాన్ల రూపంలో అయినా మంత్రి కి విషయం చేరి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు .

అపరిమిత వేగం తో వాహనాలు నడిపే వారి వల్ల వారికే కాదు అభం శుభం తెలియని అమాయకులు రోడ్డుపై బలయ్యే ప్రమాదం వుంది . అలా ఎందరో, సెలబ్రెటీల వాహనాలకింద నేలరాలిపోయారు కూడా .

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసు లో ఇలానే అమాయకులు బలయిపోయారు.

అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఇల్లు చేరే కొడుకు ఒక్క రోజు కాదు చాలా సార్లు అలానే ఇంటికి వెళ్లి ఉండొచ్చు . మరి అతడిని మందలించే తండ్రో తల్లో వారి బాధ్యత నెరవేర్చి వారికి కారు ఇచ్చినా డ్రైవర్ ను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగేవా … ?

చిన్న వయస్సులోనే వారికి అంత ప్రైవసీ తల్లితండ్రులు ఇవ్వడం భావ్యం కాదు.

ఎంతో భవిష్యత్తు వున్న నిషిత్ లాంటి వారు చావుకి ఎదురు వెళ్లడంలో తప్పెవరిది ? ఇది ఒక్క నిషిత్ విషయంలోనే కాదు . తెలుగు రాష్ట్రాల్లో వున్న సెలబ్రెటీలు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులు, ప్రతి ఒక్కరికి గుణపాఠమే.

సెలబ్రెటీలు అనే కాదు . మధ్యతరగతి వర్గాలు కూడా తాహతుకు మించి హై స్పీడ్ బైక్ లు కార్లు పుత్ర రత్నాలకు ఇచ్చి జరగరానిది జరిగినప్పుడు ఎవరిని నిందించాలో తెలియక కుదేలై పోతున్నారు.

దీనికి ప్రధాన నిందితులు తల్లితండ్రులే కనుక వారికే జీవితకాలం శిక్ష పడుతుందన్న సత్యం అంతా గ్రహించాలి…

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!