ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎడిటోరియల్

ప్రభుత్వ బ్యాంకులను మోడీ బతికిస్తారా..?

Narendra Modi
ప్రభుత్వ బ్యాంకులను మోడీ బతికిస్తారా..?

బ్యాంకులు…జాతి ఆర్థిక జవజీవాలు..కొందరు స్వార్థపరుల కారణంగా అవి కుదేలయ్యాయి..18 ప్రభుత్వ బ్యాంకులు నిరర్థక ఆస్తులు, మొండి బకాయిలల విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయి..వీటిని త్వరలో ఆర్బీఐ తన ఆధీనంలోకి తీసుకోబోతోంది.. వాటి కార్యకలాపాల్ని నియంత్రించబోతోంది..9 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలతో నడ్డివిరిగిన బ్యాంకులు ఎలా కోలుకోవాలి..? ఆర్బీఐ ఆదుకుంటుందా..? వారం క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో బ్యాంకులు తిరిగి పుంజుకుంటాయా..? ఇవే సామాన్యుడి మదిని తొలుస్తున్న ప్రశ్నలు..అయితే ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఈ ఆర్డినెన్స్ తో పెద్ద ఉపయోగం లేదని బ్యాంకింగ్ వర్గాలు పెదవి విరిస్తున్నాయి… ఇది నిజంగా షాకింగే…మొండి బకాయిల విషయంలో ఇకపై అప్పు ఇచ్చిన బ్యాంకుకు, ఆ పైన రిజర్వ్ బ్యాంకుకు కూడా అపరిమిత అధికారాల్ని కట్టబెట్టింది ప్రభుత్వం.. బ్యాంకులు మొండి బకాయిల వసూలు గురించి 90 రోజుల దాకా కూడా ఆగకుండా ఎగవేతదారుల నుంచి తన రుణాల్నిరికవరీ చేసుకోవచ్చు…రిజర్వ్ బ్యాంకు కూడా మంత్రిత్వ శాఖ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు..స్థూలంగా ఈ ఆర్డినెన్స్ వల్ల కలిగే ప్రయోజనం ఇది..అయితే ఈ ప్రయోజనం నిజంగా నెరవేరుతుందా..!!!

మొదట ఆర్బీఐ రుణాల ఎగవేత దారుల ఆస్థుల విలువను తిరిగి మదింపు చేయవచ్చు..అంటే తగ్గించవచ్చు..అలాగే బకాయిలు విపరీతంగా పేరుకుపోయి ఇక తీర్చలేని స్థితికి చేరుకున్న రుణగ్రహీతలను ఇక మేం అప్పు తీర్చలేం..దివాళా తీశాం అంటూ ఐపీ పిటిషన్ పెట్టుకోమని చెబుతుంది..అవసరమైతే బలవంతంగా ఐపీ పెట్టిస్తుంది. అయితే ఈ చర్యలు 9 లక్షల కోట్ల రూపాయల ఎగవేతదారులకు ఏ పాటి..? ఇవి బ్యాంకుల్ని పునర్జీవింపజేస్తాయా…అదే డౌటు ఇప్పుడు బ్యాంకింగ్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు..

ఈ విషయం ప్రధాని మోడీకి తెలీదా..?? ఇంత తీవ్ర సమస్యకు ఇంత చిన్న పరిష్కారంతో కూడిన ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం ఏంటి..? వారం క్రితం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ తర్వాత తీసుకోబోయే చర్యలకు నాందిగా చెప్పుకోవచ్చా..? ఒకేసారి భారీ సంస్కరణలు తేకుండా క్రమంగా ఒత్తిడి పెంచే వ్యూహమా…గత సంవత్సరం దివాళా సంస్కరణలు తెచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది చర్యలు తీసుకునే దిశగా మొదటి అడుగు వేసింది..

ఒక్కరే వివిధ బ్యాంకులనుంచి రుణాలు తీసుకోవడం, సిండికేట్ గా ఏర్పడి మరీ రుణాలు తీసుకోవడం లాంటి వాటి విషయంలో ఇప్పుడు తెచ్చిన సంస్కరణలు ఏమాత్రం పని చేయవు.. జాయింట్ లెండార్స్ ఫోరమ్స్ విషయంలోనూ కొందరు కలిసిరాకపోవడంతో ప్రతిష్ఠంబన ఏర్పడుతోంది..ముఖ్యంగా ఈ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయినవి ప్రభుత్వ బ్యాంకులే…7 లక్షల కోట్లు ప్రభుత్వ బ్యాంకుల బకాయిలే అంటే సమస్య తీవ్రత ఎంతటితో ఆలోచించవచ్చు…

ఈ ప్రభుత్వ బ్యాంకులకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఎవరూ మూడేళ్లకు మించి ఉండరు. మొండి బకాయిలు మెడకు చుట్టుకుంటాయన్న భయంతో నిర్ణయాలు తీసుకోవడానికి వారు భయ పడతారు. కొన్ని కేసుల్లో మాజీ బ్యాంక్ అధిపతులను రుణ బకాయిల విషయంలో అరెస్టు చేసిన సందర్భాలను తలచుకొని కొందరు ప్రభుత్వ బ్యాంకుల అధికారులు బిగుసుకుపోయి పనిచేస్తున్నారు. ఇటువంటి వారికి రక్షణ కల్పిస్తామన్న భరోసాను రిజర్వు బ్యాంకు ఇచ్చేలా కూడా మార్పులు ఉండాలి.

మన దేశంలో మౌలిక సౌకర్యాలు, విద్యుచ్ఛక్తి, ఇనుము, ఉక్కు పరిశ్రమల రంగాల్లో వసూలు కాని రుణాలు భారం ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులు ఇబ్బందుల్లోపడి, ధరలు పడిపోవడంతో ఆయా సంస్థలు తీసుకున్న రుణాల తాలూకు బకాయిలను సరిగా తిరిగి చెల్లించలేక పోతున్నాయని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఇబ్బందుల నుంచి కోలుకోగలుగుతుండగా మరికొందరు ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతిపాదించిన మార్పులకు ఈ అంశం కీలకం కావాలి.

చాలా కాలం గా మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకుల నుంచి కదలికను తెచ్చే విధంగా కొత్త చర్యలు ఉండగలవని మార్కెట్ లో ఆశపడ్డ వారు చివరకు నిరాశ చెందారు. ఆర్‌బిఐకి ఈ ఆర్డినెన్స్‌తో సంక్రమించిన కొత్త అధికారాలు ఏమిటి అన్నదానికి స్పష్టత ఇంకా లేదు.. ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల కంటే మెరుగ్గా మొండి బకాయిలపట్ల వ్యవహరించడానికి ఆర్‌బిఐని సమాయత్తం చేసే చర్యలు కూడా ఆ ఆర్డినెన్స్ లో లోపించాయి.

చివరకు రిటైర్డ్ బ్యాంకర్లతో కొన్ని కమిటీలు ఏర్పడతాయి. రిజర్వు బ్యాంక్ వాటికి తగిన అధికారాలు కల్పిస్తుందా అన్నది ప్రశ్న. పెద్ద సవాళ్లు అలాగే ఉండిపోతాయి. దివాళా కోడ్ వ్యవహారం జాప్యంలో ఇరుక్కుంది. దేశంలోని 20 పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రుణ సంస్థలు విదేశాల నుంచి పెట్టుబడిని పెంచుకొనే పరిస్థితిలో లేవు. వాటికి మదుపు మొత్తం అదనంగా అందించే విషయం కూడా సవాలుగానే మిగిలింది. 2019 మార్చి వరకు రూ. 700 బిలియన్ల పెట్టుబడులను ప్రభుత్వం సమకూర్చవలసి ఉంది. అలా సమకూర్చు తామని ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది.

2019 మార్చి నాటికి బ్యాంకుల పెట్టుబడి అవసరాలు 90 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా… ఆ మొత్తంలో ప్రభుత్వ యాజమాన్యంలోని రుణ సంస్థల భాగం 80 శాతం. ‘మొండి బకాయిల సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే – ఏమీ చేసినా తక్కువే అన్నంతగా’ అని ఒక ఆర్థిక నిపుణుడు స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ బ్యాంకింగ్ సంస్కరణల ఫలితం ఎంత..? ప్రభావం ఎంత..? వేచిచూడాల్సిందే…!

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!