ఆరోగ్యం

ద్రాక్ష పండ్ల‌తో నిద్ర‌లేమికి చెక్‌ పెట్టొచ్చు!

A bunch of grapes to cure your insomnia
ద్రాక్ష పండ్ల‌తో నిద్ర‌లేమికి చెక్‌ పెట్టొచ్చు!

నిద్ర‌లేమి స‌మ‌స్య మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుందా..? రాత్రి పూట ఎంత ప్ర‌య‌త్నించినా స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదా..? అయితే రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తినండి.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నిత్యం రాత్రి కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తింటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ద్రాక్ష‌ల్లో నిద్ర‌కు ఉప‌యోగ‌ప‌డే మెల‌టోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్ర చక్కగా ప‌ట్టేలా చేస్తుంది.

సాధార‌ణంగా సాయంత్రం నుంచి ప్ర‌తి మ‌నిషి శ‌రీరంలో మెల‌టోనిన్ స్థాయిలు పెరుగుతాయి.

దీంతో రాత్ర‌వుతున్న కొద్దీ ఎవ‌రికైనా నిద్ర వ‌స్తుంది. అయితే నిద్ర‌లేమి ఉన్న‌వారిలో ఈ మెల‌టోనిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి.

అందుకే వారికి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు. క‌నుక మెల‌టోనిన్ స్థాయిల‌ను పెంచేందుకు ద్రాక్ష‌ల‌ను తినాలి.

దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంద‌ని ఇట‌లీకి చెందిన సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల్లో ఇప్ప‌టికే తేల్చారు.

అలాగే మెల‌టోనిన్ ఎక్కువ‌గా ఉండే బాదం ప‌ప్పు, అర‌టి పండ్లు, వాల్‌న‌ట్స్‌, చెర్రీలు, తేనె త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకున్నా నిద్రలేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇక ఎందుకు ఆలస్యం ఈ చిన్ని చిట్కాతో మీకున్న సమస్యని ఉపసంహరించుకోండి

To Top
error: Content is protected !!