ఆరోగ్యం

ఏవి తింటే నిద్ర పడుతుందో తెలుసా!

ఏవి తింటే నిద్ర పడుతుందో తెలుసా!

సాధారణంగా రాత్రి డిన్నర్‌ తర్వాత ‘స్నాక్‌’ తీసుకోవడం మంచిది కాదనేది చాలామంది అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే కొన్ని స్నాక్స్‌ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. ‘నిద్రకుపక్రమించే ముందు ఏవైనా తినడం వల్ల నిద్రాభంగం కలుగుతుందనడంలో సందేహం లేదు. కానీ కొన్నింటిని తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంద’ని అంటున్నారు డైటీషియన్‌ సుసీ బరెల్‌. కొన్నిసార్లు నిద్ర బాగా పోవాలంటే వాటిని తీసుకోవాల్సిందే అంటున్నారామె.

అరటిపళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్‌ కావడానికి అవి బాగా ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ తగ్గకుండా అరటిపళ్లలోని కార్బోహైడ్రేట్స్‌ పనిచేస్తాయి. కాబట్టి అరటిపండు తిన్న గంటలోపే నిద్రలోకి జారుకోవడం ఖాయం.

పాలల్లో ఉండే అమినో యాసిడ్‌ ట్రిప్టోఫాన్‌ శరీరంలో సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరాన్ని నిద్రపుచ్చడంలో ఇది బాగా పనిచేస్తుంది.

నట్స్‌లో కాల్షియంతో పాటు ట్రిప్టోఫాన్‌ కూడా ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల త్వరగా నిద్రపడుతుంది.

ఇవి తినకూడదు…

నిద్రపోయేముందు డార్క్‌ చాక్లెట్‌ తినరాదు. ఇందులో కెఫిన్‌ ఉంటుంది కాబట్టి నిద్రపట్టదు.

ఐస్‌క్రీముల్లో చక్కెర, ఫ్యాట్‌ ఉంటుంది కాబట్టి మెదడుపై ప్రభావం ఉంటుంది.
చైనీస్‌ ఫుడ్‌తో పాటు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు నిద్రపోయేముందు తినకూడదు.

To Top
error: Content is protected !!