ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
భక్తిరసం

గురు పూర్ణిమ విశిష్టత

Guru Purnima importance and significance
గురు పూర్ణిమ విశిష్టత

గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా ఙ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అఙ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలాపొందాలో నేర్పుతాడు. మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు…ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనసు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకూ ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి, లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్నీ, మోహాన్నీ తుంచివేసే శక్తి సంపన్నుడు. ‘గు కారో అంధకారస్య , రు కారో తన్నిరోధకః’ అంటే గు అంటే చీకటి. రు పారద్రోలేవాడు. గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్సమానుడు.ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి ,ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు.గురువును ఎందుకు స్మరించాలి ? ఎందుకు దర్శించాలి? కృతఙ్ఞతలు ఎందుకు తెలపాలి? అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటి వాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై ,సమాజానికి ఉపయోగపడతారు. అలా గురువు సమాజ సేవచేస్తున్నాడు.గురువు మార్గదర్శకుడు ,తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించగలడు.గురు పూర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు. గురువులను అత్యంత భక్తి భావంతో పూజించేరోజు. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. వ్యాసమహర్షి మానవజాతి అఙ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవతత్వాన్ని చూపే శ్రుతి, స్మృతి పురాణాలను, శాస్రాలను అందించిన గురువు. వశిష్టుని మనుమడు, పరాశరమహర్షి కుమారుడు, శుకమహర్షి తండ్రైన వ్యాసుడు భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు. వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు.. ఆలా గురుపూర్ణిమ మన భారతీయ పండగల్లో విశిష్టమైనది..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!