భక్తిరసం

గరుడ పురాణం ప్రకారం ఈ సూచనలు కనిపిస్తే మనిషికి మరణం సంభవిస్తుంది…

identification for death of man
గరుడ పురాణం ప్రకారం ఈ సూచనలు కనిపిస్తే మనిషికి మరణం సంభవిస్తుంది...

శివుడు ఆజ్ఞలేనిదే చీమ కుడా కుట్టదంటారు పెద్దలు.సృష్టి స్టితి లయ కారకుల్లో ముఖుడైన శివుడికి తెలియకుండా ఏ జీవి మరణించలేదనీ శివుని ఆజ్ఞ లభించిన తర్వాతనే యముడు ప్రాణాలు తీసుకుపోవడానికి వస్తాడనీ మన పురాణాలు ఘంటాపదంగా చెపుతున్నాయి.అందుకే మనిషి మరణించడానికి ముందు కొన్ని మృత్యు సంకేతాలు పంపబడుతాయట.వాటిని కనిపెడితే తమకు మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చట .సాక్షాత్తు శివుడే ఈ విషయం పార్వతికి చెప్పాడట.దీనిగురుంచి శివపురాణంలో ఉందని పండితులు చెపుతున్నారు .ఈ క్రమంలో మనిషి మరణించడానికి ముందు అతనికి తెలిసే కొన్ని సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం .
ఎవరికైనా వారి ప్రతిబింబం నూనె నీరు లేదా అద్దంలో కనిపించడం లేదంటే వారు మరో ఆరు నెలల్లో చనిపోతారని తెలుసుకోవాలి . ఎవరికైతే కళ్ళు నోరు నాలుక చెవులు పనిచేయకుండా పోతాయో వారుకూడా ఆరు నెలల్లో చనిపోతారట .వీటిని మృత్యు సూచనలుగా భావించాలట.ఏ వ్యక్తి శరీరమైనా ఉన్నట్టుండి తెల్లగా లేదా పసుపురంగులోకి మారి శరీరంపై ఎరుపు రంగు మచ్చలు వస్తుంటే వారుకుడా ఆరునెలల్లో చనిపొతారట. గొంతు నాలుక వంటివి పొడి పొడిగా మారుతుంటే వారు త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువట నొప్పి కారణంగా ఎడమచేయి వెనక్కి తీసుకుంటున్నా దాంతో నాలుక పొడిగా మారినా అలాంటివారు ఒక నెలలో చనిపొతారట. సూర్యుడు లేదా చంద్రుణ్ణి చూసినప్పుడు వారిచుట్టూ ఎరుపు రంగులో రింగ్ లాంటిది ఎదైనా కనిపిస్తే వారికి 15 రోజుల్లో మరణం సంభవిస్తుందట.నక్షత్రాలు చంద్రుణ్ణి అసలు చూడలేనివారు లేదా వాటిస్థానంలో నల్లని కాంతిని చూసేవారికి మరణం అత్యంత సమీపంలో ఉందని తెలుసుకోవాల . వారికి మరణం మరో నెలలో సంభవిస్తుందట
నీలిరంగులోని ఈగలు ఎవరినైనా చుట్టుముడుతుంటే వారికి మరో నెలలో మరణం సంభవిస్తుందట. రాభందువు కాకి లేదా పావురం వచ్చి తలపై కూర్చుంటే వారికి మరణం త్వరగా సంభవిస్తుందట. అలాగే ఎవరయినా తమ నీడను తల లేకుండా చూస్తే వారుకుడా త్వరగా చనిపోతారట.ఎవరికైనా చూపు పూర్తిగా పోయినా లేదా మంట కనపడకపోయినా వారికి కూడా మరణం త్వరగా సంభవిస్తుందట .అలాగే రాత్రిపూట ప్రతిరోజు ఇంద్రధనస్సు కనిపిస్తుంటే కుడా వారు త్వరలో చనిపోతారట .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!