భక్తిరసం

ఈ శ్రావ‌ణ మాసం ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఒక్కో వారం ఒక్కో పండ‌గ?

శ్రావణ మాసం మ‌హిళ‌ల‌కు ఎంతో ప‌విత్ర‌మైన రోజు. ఈ మాసంలో వ‌చ్చే.. సోమ, మంగళ, శుక్ర, శనివారలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మ‌హిళ‌లు. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి, జంద్యాల పౌర్ణమి, పోలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే రావడం విశేషం. ఓక్కో వారం ఒక్కోక్క ప్రత్యేక పండుగ‌ను జరుపుకుంటారు భార‌తీయ మ‌హిళ‌లు. ముఖ్యంగా సోమ,శుక్రవారాలలోఅత్యంత భక్తి శ్రద్ధ్దలతో పార్వతీ దేవిని కొలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది రోజుగా భావిస్తారు ఆయ‌న భ‌క్తులు. ఈ రోజున శివభక్తులు శ్రద్ధతో శివుడిని కొలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాస దీక్షలు చేపడుతారు. అభిషేకం, రుద్రహోమం, పార్వతీదేవికి కుంకుమార్చన చేస్తే పసుపు,కుంకుమలు కలకాలం నిలిచి ఉంటుందని మహిళల నమ్మకం. ఇక మహిళ‌లు ఈ శ్రావ‌ణ మాసంలో..నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు. అలాగే త‌మ ఇళ్లు సౌభాగ్యంతో వర్థిల్లాలని కొరుతూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం(ఆగష్టు 12) రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి(ఆగష్టు 7) రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. ఆ రోజు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. సోదర, సోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ఆగష్టు18న‌ జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం రాఖీ కడుతారు. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమిని కూడా జరుపుకుంటారు. ఈ రోజు నూతన యజ్ఞోపవిత్రాన్ని ధరిస్తారు. శ్రావణ బహుళ అష్టమి రోజున అనగా ఆగష్టు 25న శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను అత్యంత‌ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు కృష్ణ భ‌క్తులు. కృష్ణుడిని ఊయాలలో వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉట్లు కొడతారు. చిన్నారులను గోపికలు, కృష్ణులుగా అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ శ్రావ‌ణ మాసం ఎంతో ప‌విత్రంగా ఉండాలనుకుంటారు మ‌హిళ‌లు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!