ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
భక్తిరసం

ఇక్క‌డి దేవుడు స‌త్య ప్ర‌మాణాల దేవుడ‌ని మీకు తెలుసా?

ఇక్క‌డి దేవుడు స‌త్య ప్ర‌మాణాల దేవుడ‌ని మీకు తెలుసా?

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. అంటే ఎవ‌రైనా స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వాళ్లు ఎవ‌రైనా స‌రే స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి క్ర‌మంగా దూరం అవుతారని భక్తులు న‌మ్ముతారు. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..! వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు. కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!