క్రీడలు

శ్రీవారి ఆలయంలో ఐపీఎల్‌ ట్రోఫీకి ప్రత్యేక పూజలు

ipl trophy
శ్రీవారి ఆలయంలో ఐపీఎల్‌ ట్రోఫీకి ప్రత్యేక పూజలు

ఈ ఏడాది ఐపీఎల్‌ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సోమవారం సాయంత్రం సొంత గడ్డకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆటగాళ్లకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ‘సీఎస్‌కే.. ధోనీ..’ అంటూ అభిమానులు సందడి చేశారు. అనంతరం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆటగాళ్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం మంగళవారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని తితిదే ఆధ్వర్యంలోని శ్రీవారి ఆలయాన్ని పలువురు ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు దర్శంచుకున్నారు. జట్టు గెలుచుకున్న ఐపీఎల్‌ ట్రోఫీని వారు ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ ట్రోఫీకి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఏడాది ముంబయి ఇండియన్స్‌ కూడా ట్రోఫీ గెలుచుకున్న అనంతరం ముంబయిలోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

To Top
error: Content is protected !!