ఆరోగ్యం

గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన మరో క్రికెటర్!

గుండె పోటు అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు ఇప్పుడు ప్రస్తుతం దీని భయం అందరిని కల్లోలం లో పడేస్తుంది .ఎంతో మందిని ఈ గుండెపోటు వల్లే బాలి తీసుకుంటుంది .

అస్సలు విషయానికి వస్తే మనం ఇంతక ముందే ఒక క్రికెట్ మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూ చనిపోయిన వీడియో వైరల్ అవ్వడం చూసాం . ఇప్పుడు ఇది ముంబై యువ క్రికెటర్‌ వైభవ్‌ కేసర్కార్‌ గుండె పోటుతో మైదానంలో కుప్పకూలి మృతి చెందాడు.

స్థానికంగా జరిగిన టెన్నిస్ బాల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌ మైదానంలో గుండె నొప్పితో విలవిల్లాడాడు. ఆడుతున్నప్పుడు ఛాతిలో ఏదో ఇబ్బందిగా ఉందని వైభవ్‌ చెప్పినట్టు సహచరులు తెలిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా..

అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. యూట్యూబ్‌ చానెల్‌లో ప్రత్యక్షప్రసారమైన ఈ మ్యాచ్‌లో.. నొప్పిగా ఉన్నా..

వైభవ్‌ బ్యాటింగ్‌ చేస్తూనే కనిపించాడు. గోన్‌దేవి జట్టు తరఫున ఆడుతున్న 24 ఏళ్ల వైభవ్‌.. ముంబై లోకల్‌ క్రికెటర్లలో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు.

ఇలా ఎంతో మంది గుండె పోటుతో చనిపోయిన వారు వున్నారు కాబట్టి ఆటలు ఆడేవారు వారికీ గుండెపోటు రాకుండా మరియు గుండెపోటు సింటమ్స్ ఎలా వుంటాయో తెలుసుకొని ఒకవేళ వారికీ ఆలా అనిపిస్తే త్వరగా వైద్య నిపుణులను సంప్రదించ వలసిందిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి.

To Top
error: Content is protected !!