నేషనల్

గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్…

congress to file case against governors decision
గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్...

అనేక ఉత్కంఠల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ బీజేపీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకటించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ వైపే గవర్నర్ మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. దీంతో రేపు ఉదయం 9.30కు యడ్యూరప్ప రాజ్‌భవన్‌లో కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రతినిధి తెలిపారు. అయితే.. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో తమ బలాన్ని బీజేపీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 112 మంది సభ్యులను అసెంబ్లీలో చూపించాలి. అయితే.. ప్రస్తుతం బీజేపీకి 104 సీట్ల బలం మాత్రమే ఉంది. బల నిరూపణ తర్వాతే కేబినేట్ విస్తరణ ఉండనుంది. ప్రభుత్వం ఏర్పాటుపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని బీజేపీ ప్రతినిధులు తెలిపారు. అయితే.. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.

ఇదివరకే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కర్ణాటక గవర్నర్‌తో తెలిపారు. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కుమారస్వామి కోరారు. అయినప్పటికీ.. గవర్నర్ బీజేపీ వైపే మొగ్గు చూపారు.

To Top
error: Content is protected !!