తెలంగాణ

టీఆరెస్ లో చేరిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA Yellareddy’s Surender joins TRS
టీఆరెస్ లో చేరిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు లేఖ విడుదల చేశారు. ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా గల్లంతయినట్టే అనే వార్తలు కూడా వినిపించాయి.

తాజాగా ఎమ్మెల్యే సురేందర్ కూడా కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మరింత తగ్గిపోనుంది. ఎల్లారెడ్డి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేందర్‌కు గతంలో టీఆర్ఎస్‌లో పని చేసిన అనుభవం ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో కేసీఆర్‌తో కలిసి పని చేసిన సురేందర్… గతంలో టీఆర్ఎస్ నుండి తనకు టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని వీడారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి పలుసార్లు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలైన సురేందర్ రెడ్డి… గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తొలిసారి విజయం సాధించారు.

To Top
error: Content is protected !!