అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
తెలంగాణ

ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత కరీం సహా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతోనే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్‌ నేత కరీం విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రణయ్‌ని హత్య చేసేందుకు మారుతీరావు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

మిర్యాలగూడ పట్టణంలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ను చంపేందుకు ముందస్తుగా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తనకు ప్రాణాపాయం ఉందని ముందే గుర్తించిన ప్రణయ్‌ తన ఇంటి లోపల, బయట ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అనుమానితుల కదలికలను ఎప్పటికపుడు ప్రణయ్‌ గుర్తిస్తుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు హత్యకు సుపారీ తీసుకున్న గ్యాంగ్‌ సభ్యులు నిరంతరం వారి కదలికలను పర్యవేక్షిస్తుండేవారు. ప్రణయ్‌ శుక్రవారం తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కారులో బయటికి రాగానే వెంటనే ద్విచక్ర వాహనంపై నిందితుడు అనుసరించాడు. కారు బయలు దేరిన వెంటనే మూడు నిముషాల వ్యవధిలోనే నిందితుడు వారిని అనుసరించిన విషయం సీసీ కెమెరాలో రికార్డు కాగా దీన్ని ఎస్సై నాగరాజు శనివారం సేకరించారు. పట్టణంలోని సుష్మ ఆసుపత్రి సీసీ కెమెరాల్లో కూడా నిందితుడి కదలికలు నమోదు అయ్యాయి. వీటి ఆధారంగా పక్కాగా నిందితుడు ఆసుపత్రిలోకి ప్రవేశించి అక్కడే మాటు వేశాడు. ప్రణయ్‌ తన భార్య అమృత, తల్లి ప్రేమలతతో కలిసి కారు వద్దకు వస్తుండగానే వెనక నుంచి మాటువేసి కత్తితో నరికి హత్యచేశాడు. హత్య జరిగిన సమాచారం స్వయంగా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగానే ఆయన తన వాహనంలో అద్దంకి రహదారిపై వెళ్లాడు. ఈ విషయం మాడుగుల పల్లి టోల్‌గేట్‌ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

To Top
error: Content is protected !!