సినిమా

రాంచరణ్ అల్లు అర్జున్ స్థాయికి వచ్చేసాడు….,

varun tej special training for his next movie
రాంచరణ్ అల్లు అర్జున్ స్థాయికి వచ్చేసాడు....,

మెగా హీరోల్లో అందరూ మాస్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నరు. కానీ వరుణ్ మాత్రం అందరికంటే డిఫెరెంట్ గా క్లాస్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాడు. మాస్ లక్షణాలు బాగా ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ రూట్ లో ప్రయోగాలు చేయలేకపోతున్నాడు. ఫిదా లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ తరువాత మళ్లీ లవ్ స్టోరీతో వచ్చి తొలిప్రేమ తో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తొలిప్రేమ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే అదే ఉపును కొనసాగించాలని వరుణ్ తేజ్ ప్లాన్స్ వేస్తున్నాడు. నెక్స్ట్ సినిమాకు తగ్గట్టుగా తను మొత్తంగా మరిపోతున్నాడు. ఘాజి వంటి సినిమాతో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పేస్ కథను ఒకే చేశాడు. అయితే ఈ సినిమా కోసం వరుణ్ స్పెషల్ ఫిట్ నెస్ తో కనిపించడానికి కజకిస్తాన్ వెళ్తున్నాడు. అక్కడ ఒక జిమ్ ట్రైనర్ తో కొన్ని నెలల వరకు వర్కౌట్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మొన్నటి వరకు సంకల్ప్ రెడ్డితో ఇదే చర్చలు జారిపాడు. అయితే ఎవరు అంతగా వెళ్లని కజకిస్తాన్ లో అంత మంచి ట్రైనింగ్ ఏముందని ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ లేని వెయిట్ లాస్ ప్రోగ్రాములు అక్కడ ఏమున్నాయి? అని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ చాలా డెవెలప్ అయ్యింది. బన్నీ, మనోజ్, రానా ,రామ్ చరణ్ వంటి హీరోలు ఎక్కువగా ఇక్కడే పాత్రకు తగ్గట్టుగా వర్కౌట్స్ చేస్తారు. మరి వరుణ్ ఏంటో కజకిస్తాన్ వైపు కన్నేశాడు. చూడాలి మరి అక్కడికి వెళ్లి వచ్చాక ఎంతో స్పెషల్ గా ఉంటాడో. ఇక ఆ స్పేస్ థ్రిల్లర్ మూవీ మరికొన్ని వారాల్లో స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

To Top
error: Content is protected !!