సినిమా

ప్రభాస్ నితిన్ లపై వరుణ్ కామెడీ సెటైర్స్…..,

varun comments on prabhas and nithin
ప్రభాస్ నితిన్ లపై వరుణ్ కామెడీ సెటైర్స్.....,

పెళ్లి అంటే ఈ రోజుల్లో చాలా మంది యువకులు భయపడిపోతున్నారు. అప్పుడే సంసార బాధ్యతలను తీసుకోవాడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. మూడు పదుల వయసు దాటినప్పటికీ ఏ మాత్రం తొందరపడకుండా చాలా కూల్ గా కెరీర్ ను ముందుకు తీసుకువెళుతున్నారు. కానీ వయసు పెరుగుతోందని పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్ అనే ప్రశ్నలు హీరోలకు ఎదురవుతూనే ఉన్నాయ్. రీసెంట్ గా అదే తరహాలో స్టార్ హీరో వరుణ్ తేజ్ కి కూడా ఎదురైంది. పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అంటే.. అందరిలానే ఈ కుర్ర హీరో అప్పుడే అన్ని బాధ్యతలు వద్దు అనేస్తున్నాడు. అంతే కాకుండా ప్రభాస్ అన్న నితిన్ మాకు ఇన్ స్పిరేషన్ అని ఉదాహరణలు కూడా చెప్పాడు. దీంతో మన స్టార్ హీరోలు కుర్ర హీరోలకు ఏ స్థాయిలో స్ఫూర్తిగా నిలుస్తున్నారో చెప్పవచ్చు. సాధారణంగా ఎవరైనా హీరో బాక్స్ ఆఫీస్ హిట్స్ కొడితే స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ మన వరుణ్ తేజ్ లాంటి వాళ్లు మాత్రం బ్యాచులర్ లైఫ్ ని స్ఫూర్తిగా తీసుకోవడం చూస్తుంటే అందరి పెళ్లిళ్లు నలభై లో జరుగుతాయా ఏంటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానా శర్వా సాయి ధరమ్ తేజ్ నిఖిల్ నారా రోహిత్ అల్లు శిరీష్ వంటి స్టార్ హీరోలకు ఇప్పటికే మూడు పదుల వయసు దాటింది. మరి ఈ హీరోలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.

To Top
error: Content is protected !!