సినిమా

నిజాన్ని ఒప్పేసుకున్న రేష్మి….!

Rashmi Gautham

 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కౌన్సిలింగ్ కు హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులుగా కౌన్సిలింగ్ కు రాకుండా ప్రదీప్ తప్పించుకుంటున్నాడు. ఘటన జరిగినప్పటి నుంచి ప్రదీప్ అజ్ఞాతంలో ఉన్నాడు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. అయితే గత రెండు రోజులుగా ప్రదీప్ కౌన్సిలింగ్ కు వస్తాడని భావించినప్పటికీ అతడు రాలేదు. దీంతో ఈరోజు ప్రదీప్ కౌన్సిలింగ్ కు వస్తాడా…రాడా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కౌన్సిలింగ్ కు రాని పక్షంలో ప్రదీప్ ను పరారీలో ఉన్న వ్యక్తిగా చూపిస్తూ ఈ కేసును లాఅండ్ఆర్డర్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇక ప్రదీప్ కారులో ఉన్న అమ్మాయి ఎవరంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి . అది ఎవరో కాదు మరో స్టార్ లేడి యాంకర్ రేష్మి అని కొందరు అంటున్నారు . ఈ విషయంపై స్పందించి రేష్మి . ‘ కొందరు అనవసరంగా నన్ను ఈ ఇష్యులోకి లాగుతున్నారు , అవును నేను ప్రదీప్ వెళ్లిన పార్టీలో ఉన్నాను , కానీ అతని కారులో వున్నది మాత్రం నేను కాదు , అది ఎవరో మేరె తెలుసుకోండి అంటూ వ్యాఖ్యలు చేసింది.

To Top
error: Content is protected !!