సినిమా

లేట్ వయసులో ఘాటు రొమాన్స్ చేస్తున్న రాజేంద్రప్రసాద్

రాజేంద్రప్రసాద్ అప్పట్లో హాస్య ప్రధాన సినిమాలు మాత్రమే కాకుండా యాక్షన్ మరియు సెంటిమెంటు సినిమాలలో సైతం హీరోగా నటించి అందరి మన్ననలను పొందాడు. రాను రాను తన మార్కెట్ పడిపోతూవస్తుండటంతో ఇక క్యారెక్టర్ నటుడిగా సినీ కెరీరును కొనసాగిస్తున్నాడు.  ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రం ‘ఊ.పె.కు.హ’. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అనేది దీనికి టాగ్ లైన్. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదలచేసింది. ఇక ఈ ట్రైలర్ ను చూసిన వాళ్లు దీనికంటే బూతు సినిమానే నయం అని అనడం ఖాయం. ఈ ట్రైలర్ లో బూతు తప్ప మరెక్కడా ఏదీ ఉండదు. ఇలాంటి సినిమాలో రాజేంద్రప్రసాద్ నటించడం ఒక ఎత్తు అయితే కూతురి వరస అయ్యే హీరోయిన్ సాక్షి చౌదరి తో ఆయన చేసే రొమాన్స్ ప్రేక్షకులకు చూడాలనిపించడంలేదు.అహ నా పెళ్ళంట, ఆ ఒక్కటీ అడక్కు వంటి క్లీన్ అండ్ నీట్ కామెడీ సినిమాలు, ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి గుండెకు హత్తుకొనే సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా ఇలాంటి సినిమా ట్రైలర్లో కనిపించడం ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఒక్క సినిమాతో ముందు సంపాదించుకున్న పేరంతా నాశనం అవుతుందని ఆయన అభిమానులే అభిప్రాయపడుతున్నారు.

To Top
error: Content is protected !!