సినిమా

కష్టాలో రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ సినిమా

rajamouli multi starrer movie story not finalised
కష్టాలో రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ సినిమా

బాహుబలి సిరీస్ సినిమాలతో యావత్ భారతదేశాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేసాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమాతో భారతదేశం లో మేటి దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి కోసం ఇప్పుడు టాలీవుడ్ హీరోలే కాదు బాలీవుడ్ హీరోలు కూడా ఆయన పిలుపు కోసం వేచి చూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం బాహుబలి తరువాత గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. కథ సిద్ధం చేసే పనిని తన తండ్రి విజయేంద్రప్రసాద్ కు అప్పగించాడు. అయితే తన తండ్రి చెప్పిన ఒక లైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాడంట. ఈ సినిమానే ఆయన ఎన్ఠీఆర్ – చరణ్ కలయిక లో తియ్యాలని అనుకున్నారు. ఈ లైన్ ని వారిద్దరికి వినిపించి అప్పుడు దిగిన ఫోటో ను సోషల్ మీడియా లో పెట్టి జనాలకు హింట్ ఇచ్చాడు.అయితే తాజాగా విజయేంద్రప్రసాద్ 2, 3 వెర్షన్లు తయారుచేసి రాజమౌళి కి వినిపించినప్పటికీ అవేవి నచ్చకపోవడంతో ఇంకా సినిమాను ఫైనల్ చెయ్యలేదనే విషయం తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ఫైనల్ వెర్షన్ ఎప్పుడు రెడీ అవుతుందో, అసలు ఉంటుందో లేదో అని మెగా నందమూరి అభిమానులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది.

To Top
error: Content is protected !!