సినిమా

ఛార్మి బట్టలు లేకుండా నటించడంపై పూరి స్పందన ….!

అంత‌ర్జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ తీస్తానంటూ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాథ్ విడుద‌ల చేసిన న్యూడ్ పోస్ట‌ర్ కొన్ని రోజుల క్రితం సంచ‌ల‌నం సృష్టించింది.గురువు రామ్‌గోపాల్ వ‌ర్మ బాట‌లోనే పూరీ కూడా న‌డుస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు విన‌బ‌డ్డాయి. `హ‌గ్` అంటూ పూరీ విడుద‌ల చేసిన న్యూడ్ పోస్ట‌ర్ ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. డిసెంబ‌ర్ 31న ఆ ల‌ఘు చిత్రాన్ని విడుద‌ల చేస్తాన‌ని పూరీ ప్ర‌క‌టించాడు. ప్ర‌క‌టించిన‌ట్టుగానే ఆదివారం `హ‌గ్‌` షార్ట్‌ఫిల్మ్‌ను పూరీ విడుద‌ల చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా పూర్తిగా చెట్ల గురించి, వాటి వల‌న మాన‌వాళికి క‌లిగే లాభాల గురించి వివ‌రించాడు. మూడున్న‌ర నిమిషాల‌పాటు ఉన్న ఈ షార్ట్‌ఫిల్మ్ పూర్తిగా వాయిస్ ఓవ‌ర్‌తోనే న‌డించింది. అయితే ఈ షార్ట్ ఫిలిం లో ఛార్మి నగ్నంగా నటించిందని కొన్ని వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో . ఇప్పటివరకు ఈ వార్తా పై ఎవరు స్పందించాలేదు .., మొదటిసారి పూరి ఈ విషయంపై పూరి వివరణ ఇచ్చాడు .., ‘ దీని గురించి నేను ఏమి మాట్లాడాను , నా షార్ట్ ఫిల్మ్ సంధానం చెప్తుంది . ఆ పాత్ర చేసింది ఎవరో తెలియాలంటే నా షార్ట్ ఫిల్మ్‌ చూడాల్సిందే ‘ అని బదులిచ్చాడు పూరి . ఇక ముందుగా విడుద‌ల చేసిన‌ పోస్ట‌ర్‌లో ఉన్న న్యూడ్ స్టిల్‌తో షార్ట్‌ఫిల్మ్‌ను ముగించాడు. పూరీ టేకింగ్‌, సందీప్ చౌతా నేప‌థ్య సంగీతం షార్ట్‌ఫిల్మ్‌ను ఆస‌క్తిక‌రంగా మార్చాయి.

To Top
error: Content is protected !!