సినిమా

పవన్ అభిమానులకు తీపికబురు!

pawan kalyan new movie to start next month
పవన్ అభిమానులకు తీపికబురు!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుస పర్యటనలు, మీటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓ వైపు సమస్యలపై స్పందిస్తూనే… మరో వైపు జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయన సినీ అభిమానులు నిరుత్సాసంలో ఉన్నారట. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన సినిమాలు చేస్తాడా.. లేదా అనే అంశాలు మాత్రం అభిమానులను కంటిమీద కునుకువేయనీయడం లేదట. ఇక పవన్‌ని తెరపై చూడలేమా అనే ఆందోళనలో ఉన్నారట.. అసలు పవన్ రాజకీయాల్లోనే కొనసాగుతారా…? సినిమాలు చేయరా…? అనే విషయాలు వారిని ప్రతి రోజూ వెంటాడుతున్నాయట. అయితే సినీ వర్గాలు మాత్రం పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారని చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నెల, నెలన్నర కాలంలో ఒక కొత్త సినిమా చేయబోతున్నారని అంటున్నాయి. అటు పవన్ కూడా పరిమిత సంఖ్యలోనే కాల్షీట్లు ఇచ్చినట్లు చెబుతున్నాయి. అయితే పవన్ ఏ దర్శకుడితో పని చేయనున్నాడనే విషయంపై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఎ.ఎమ్ రత్నం నిర్మాణంలో ఇదివరికే ఓ సినిమాకు కమిట్ అయిన వపన్ కల్యాణ్ ఆ మూవీకి కొబ్బరికాయ కొట్టిన ఆ సినిమాను పవన్ చేయడం లేదని, అందుకే నిల్చి పోయిందని ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు మరో ప్రచారం కొత్తగా వెలుగులోకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ రెండు ప్రాజెక్టులో పవన్ దేనికి ఓటు వేస్తాడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. దీంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొందట. అసలు పవన్ దారెటు..? అంటూ ప్రశ్నిస్తున్నారట. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పవన్ మాత్రం సినిమాలు చేస్తూనే ఉండాలని అభిమానులు కోరుతున్నారట.

To Top
error: Content is protected !!