సినిమా

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా వచ్చేస్తుంది..,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జోష్ నింపే వార్త ఇది. ‘అజ్ఞాతవాసి’తో థియేటర్స్ కు వచ్చిన పవన్ స్టార్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయొచ్చనేది నిన్నటి వరకూ ఉన్న మాట. అయితే ఆయన ‘అజ్ఞాతవాసి’తో ఆగిపోవడం లేదు. ‘చరిత్ర’ తిరగరాసేందుకు మరో మూవీతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారనేది సినీ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు ఆయన తరువాత చిత్రానికి పవన్ ఫ్యాన్స్ రోమాలు నిక్కపొడిచే టైటిల్ ప్రచారంలోకి రావడంతో జనసేనాని అభిమానులు ఫుల్ జోష్ లో కి వచ్చేశారు. నిశబ్దం వీడి ఆయుధం అనే ఉప శీర్షికతో ‘చరిత్ర’ అనే టైటిల్ తో పవన్ తరువాత చిత్రం ఉండబోతుందని.. ‘చరిత్ర’ పేరుతో పవన్ పిడికిలి బిగించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ సినిమాకు ముందుగా ఈ సినిమానే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా మొదలవ్వడంతో ఈ రీమేక్ ఆలస్యమైందని తెలుస్తోంది. ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఇటీవల విషయాలను చెప్పుకొచ్చాడు. అతడు డైరెక్ట్ చేసిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు ఎదురైన ప్రశ్నలకు జవాబుగా ఆయన పవన్ సినిమా విషయాల గురించి స్పష్టం చేశాడు. దీనితో పాటు ఇటీవల ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలోనూ ఏ ఎమ్ రత్నం స్టేజ్ మీద పవన్ పక్కనే ఉండటం వీరి కాంబినేషన్ మూవీ పట్టాలెక్కేందుకు డోకా లేదని తేలిపోయింది. ఇక మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ మూవీలో పవన్ సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నట్టు సమాచారం.

To Top
error: Content is protected !!