సినిమా

నాని అసలు మొగాడేనా…,నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు

nithya menon funny comments on nani
నాని అసలు మొగాడేనా...,నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు తక్కువనే మాట ఎప్పటి నుంచో ఉన్నదే. ఒకవేళ ఒకటో రెండో వచ్చినా అవి చిన్న సినిమాలే. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు.. హీరోయిన్లు కొత్త తరహా సినిమాలంటే కాస్తంత వెనుకడుగు వేస్తారు. కానీ నాచురల్ స్టార్ నాని దీనికి భిన్నంగా అ! సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. అ! సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా..,ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్. వీళ్లంతా ఇమేజ్.. గ్లామర్ లెక్కలు చూడకుండా ఈ రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నాని దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో నటించిన అందరి లుక్స్ ను  ఒక్కొక్కటిగా విడుదల చేసి సినిమాపై ఆసక్తిని కలిగించాడు. ఈ చిత్ర ప్రమోషన్స్  లో భాగంగా సినిమాలోని నలుగురు అందమైన భామలతో కలిసి ప్రొడ్యూసర్ నాని ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ యాక్టర్స్ ను  మాత్రం పలకరించాను  ప్రొడ్యూసర్ ని ఇంకా పలకరించలేదు అన్నది. దీంతో నిత్యామీనన్ ‘ఇక్కడ మగవాళ్లెక్కడ ఉన్నారు’ అని అమాయకంగా ప్రశ్నించింది. నాని లేవబోతుండగా ‘రేయ్ నువ్వు కాదురా.. యాక్టర్స్ రా’ అని చెప్పడంతో నాని కూల్ అయ్యాడు.

To Top
error: Content is protected !!