సినిమా

తన సక్సెస్ సీక్రెట్ బయట పెట్టిన హీరో నాని.

‘నా సినిమాలో నేనే హీరో.. నా సినిమాకి నేనే ప్రేక్షకుడ్ని. సినిమాలో నటించేంతవరకే నేను హీరోని.. సినిమా విడుదలయ్యాక ఆ సినిమాని ప్రేక్షకుడిలానే చూస్తాను. బహుశా అదే నా విజయరహస్యమేమో. సినిమా విడుదలయ్యాక మాత్రమే కాదు, కొత్త సినిమాని ఒప్పుకునేటప్పుడూ ప్రేక్షకుడిలానే ఆలోచిస్తాను. సినిమా వేరు, ప్రేక్షుడు వేరు కాదు. ఎవరైనా, అంతిమంగా సినిమా ప్రేక్షకులమే. అలా అనుకోకపోతే, విజయాలు దరిచేరవు..’ అంటున్నాడు యంగ్‌ హీరో నాని. ‘ఎంసీఏ’ సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నాని, చేసే సినిమాల విషయంలో పూర్తి క్లారిటీతో వుంటాననీ, ఇంతా చేసినా సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి తాను అతీతం ఏమాత్రం కాబోనని తనకూ తెలుసని అన్నాడు. సక్సెస్‌ ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూనే వుంటుందనీ, అదే సమయంలో బాధ్యతను పెంచేస్తుందనీ, అందుకే సినిమా సినిమాకీ మరింత బాధ్యతతో వ్యవహరిస్తుంటానని నాని చెప్పుకొచ్చాడు. తన తాజా చిత్రం ‘ఎంసీఏ’ ఓ సాధారణ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి కోణంలోనే వుంటుందనీ, హీరోగా తానెప్పుడూ స్టార్‌డమ్‌ల గురించి ఆలోచించనని నాని అంటున్నాడు. మొత్తమ్మీద, వరుస సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్న నాని, మరోమారు ‘ఎంసీఏ’ సినిమాతో సక్సెస్‌ అందుకుంటాడా.? వేచి చూడాల్సిందే.

To Top
error: Content is protected !!