సినిమా

సమంత పాటలో మీరు పసిగట్టని ఆశ్ఛర్యకర పాయింట్

mistakes in rangastalam song
సమంత పాటలో మీరు పసిగట్టని ఆశ్ఛర్యకర పాయింట్

ఈ ఏడాది సమ్మర్ బొనంజాకు మార్చి 30వ తేదీన విడుదల కానున్న సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” తెరలేపుతున్న విషయం తెలిసిందే. చెర్రీ ‘సౌండ్ ఇంజినీర్’గా… అదేలే… చెవిటి వాడిగా కనిపించనున్న ఈ సినిమాలో సమంత మూగమ్మాయిగా నటిస్తుందన్న పుకార్లు గతంలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవి పుకార్లు కాదు, నిజమే అన్న విషయం “రంగస్థలం” తొలి పాట చెప్పకనే చెప్పిందా? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రియులు. ఈ సినిమాలో తనకు బాగా ఇష్టమైన పాట అంటూ కీర్తించిన సమంత, ఈ పాటలో ఒక్క పలుకు కూడా లేకపోవడం ఇందుకు మరింత బలాన్నిస్తోంది. ఇన్ స్టంట్ హిట్ గా నిలిచిన ‘ఎంత సక్కగున్నావే’ అంటూ సాగిన ఈ పాట అంతా దేవిశ్రీప్రసాద్ స్వరం ఒక్కటే వినిపిస్తుంది. సినిమాలో సమంతపై రామ్ చరణ్ ఆలపించారన్న మాట. సమంతకు ఒక్క పదం కూడా ఇవ్వలేదంటే… ఆమె మూగ క్యారెక్టర్ ను పరోక్షంగా ప్రేక్షకులకు పరిచయం చేయడమే. పాట చూస్తే సమంతకి లిరికల్ గా ఒక్క పదం కూడా ఇవ్వకపోవడం , మొత్తం పాట అంత రామ్ చరణ్ పాయింట్ అఫ్ వ్యూలోనే ఉండటం పాట మొత్తంలో గమనించాల్సిన విషయం .

To Top
error: Content is protected !!