సినిమా

మంచులక్ష్మీ తో నాగార్జున ఘాటైన రొమాన్స్!

మంచులక్ష్మీ తో నాగార్జున ఘాటైన రొమాన్స్ ....!

ప్రస్తుతం టాలీవుడ్ లో వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్థోంది అందుకే పేరున్న దర్శకులు, హీరోలు కూడా ఈ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పటికే ఈ సీరిస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘కడప’ పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభిస్తున్నాడు. అలాగే హీరో విక్టరీ వెంకటేష్ .. రానా తో సహా అందరూ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ బాటలోనే నడవాలని మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్లాన్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా లక్ష్మి ఎంపిక చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ దాదాపు పది, పదిహేను ఎపిసోడ్స్ వరకూ వుండేలా ప్లాన్ చేసుకున్నారు. అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ లో నాగార్జున చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, మంచు లక్ష్మి ఈ కాన్సెప్ట్ ను నాగార్జునకు చెప్పడంతో ఆయన ఈ సిరీస్ బాగుంది అని చెప్పాడే కానీ అందులో చేసేది లేనిది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదట. అయితే ఈ కథ చాలా బోల్డ్ గా ఉంటుంది అట …, అర్జునరెడ్డిల బోల్డ్ రొమాంటిక్ సీన్స్ బోలెడు ఉంటాయట .., అందుకే లక్ష్మి పక్కన మన్మధుడు ఐన , నాగ్ అయితేనే బెటర్ అని అనుకుంటున్నారట . కానీ నాగార్జున వంటి ఒక సీనియర్ స్టార్ హీరో వెబ్ సిరీస్లో రచ్చ చేయడం , విశేషం అని చెప్పొచ్చు . ఒక వేళ ఈ ప్రాజెక్ట్ లో నాగ్ చేసేందుకు ఒప్పుకోకపోతే ఆయన మేనల్లుడు సుమంత్ ని రంగంలోకి దించాలని మంచు లక్ష్మి ప్లాన్ వేస్తోంది. అయితే ఇందులో ఆమె నటిస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

To Top
error: Content is protected !!