సినిమా

ఎట్టకేలకు రానే వచ్చాడు…!

mahesh babu at manasuku nachindi pre release event
ఎట్టకేలకు రానే వచ్చాడు...!

మంజుల ఘట్టమనేని.. కృష్ణ గారి ముద్దుల కూతురిగా మాత్రమే కాక ఒక మంచి నిర్మాతగా కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తను దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రంగా మన ముందుకు రాబోతోంది ‘మనసుకు నచ్చింది’. ఈ సినిమా లో సందీప్ కిషన్ – అమైరా దస్తూర్ ముఖ్య తారాగణం. ట్రైలర్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. మహేష్ బాబు కు మంజుల అక్క అవుతుంది. మరి అక్క సినిమా కి అది కూడా తను దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమాకి తమ్ముడి హంగామా లేకపోతే ఎలా? మొన్నటికి మొన్న జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో అందరూ మహేష్ వస్తాడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రోగ్రాం అయిపోయింది కానీ మహేష్ బాబు మాత్రం రాకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఏవేవో రూమర్లు చక్కర్లు కొడుతున్న సమయంలో అవన్నీ అబద్దం అని నిరూపించారు ఈ అక్కా తమ్ముళ్లు. మనసుకు నచ్చింది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న సమయంలో మహాష్ ఎంట్రీ ఫాన్స్ లో మరింత సంతోషం నింపింది. ఆడియో లాంచ్ కి రాకపోయినా కనీసం ప్రీ రిలీజ్ వచ్చినందుకు ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పటికీ అక్క కోసం ఒక రోజు కేటాయించి ప్రోగ్రాం కు విచ్చేశాడు. చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఇంటర్వ్యూ లు ఫోటోలకు పోజులు కూడా ఇచ్చేస్తున్నాడండోయ్.

To Top
error: Content is protected !!