సినిమా

రాజమౌళి పూజలపై బాబు గోగినేని ఘాటైన వ్యాఖ్యలు…,విన్నారంటే షాక్ అవుతారు

babu gogineni about rajamouli
రాజమౌళి పూజలపై బాబు గోగినేని ఘాటైన వ్యాఖ్యలు...,విన్నారంటే షాక్ అవుతారు

బాహుబలి మేకర్ దర్శకుడు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త అటు ఫిలిమ్ నగర్లోనూ ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవగ్రహాల ప్రసన్నం కోసం రాజమౌళి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. వేద పండితులు చెప్పిన మాటలను జవదాటకుండా రాజమౌళి మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాల సమయంలో జక్కన్నకు శుక్రమహాదశ నడిచిందట. ఈ దశలో ఎవరున్నా పట్టిందల్లా బంగారం అవుతుందట. అయితే ప్రస్తుతం రాజమౌళి దశ మారిందట. దీంతో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయిస్తే బాగుంటుందని పండితులు చెప్పారుట. ఇందుకు సరేనన్న రాజమౌళి.. మంత్రాలయంలో పూజలు చేయించారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ ఉదంతంపై బాబు గోగినేని ఫైర్ అయ్యాడు . ‘ రాజమౌళి స్వశక్తితో ఎదిగిన వ్యక్తి . తనను తానూ నాస్తికుడిగా చెప్పుకుంటూ , ప్రపంచానికి మానవ బలాన్ని చాటి చెప్పి , తీరా ఆ క్రెడిట్ మొత్తాన్ని దేవుడికి ఇచ్చేసి ప్రజలకు ఎం మెసేజి ఇవ్వాలి అనుకుంటున్నాడో రాజమౌళి నాకైతే అర్ధం కావట్లేదు ‘ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు . చూద్దాము సిసిల మీడియాలో యాక్టివ్ వుండే రాజమౌళి , బాబు మాటలపై ఎలా స్పందిస్తాడో .

To Top
error: Content is protected !!