సినిమా

అజ్ఞాతవాసి 6రోజుల కలెక్షన్స్…

agnyaathavaasi collections
అజ్ఞాతవాసి 6రోజుల కలెక్షన్స్...

జనసేనాని జన హృదయనేతగా ఆవిర్భవించాలని ఆరాటపడుతున్న తరుణాన వచ్చిన చిత్రం.. అదీ తన పాతికో సినిమా… ఇక ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్సే.. సినిమాలకు రాం రాం… అని పవన్ పలుమార్లు చెప్పి తన అభిమానుల గుండెలకు గాయం సైతం చేశాడు. ఇక మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన చిత్రం… పైగా పవన్ కు ఆయన అత్యంత ఆప్తుడు కూడా…. ఈ క్రమంలో భారీ అంచనాలతో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి భరిలోకి పందెం కోడిలా దిగిన ‘అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి షో తోనే బొక్కాబోర్లాపడింది. కనీసం అభిమానులకు సైతం ఈ మూవీ నచ్చలేదంటే..ఎంత చెత్తగా త్రివిక్రమ్ ఈ మూవీ ని తెరకెక్కించారో అర్ధం చేసుకోవాలి.., కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా సోమవారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో రూ.37.38 కోట్ల షేర్ని రాబట్టిందని.. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.53 కోట్ల వరకు షేర్ రాబట్టుకుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే యుఎస్లో సోమవారం నాటికి ఎక్కడ కలెక్షన్స్ పడిపోకుండా 2 మిలియన్ డాలర్ల క్లబ్లో స్థానం సంపాదించుకుంది. కాగా, తాజాగా యాడ్ చేసిన వెంకటేష్ సీన్స్ కూడా సినిమాకి ఏ విధంగానూ ప్లస్ కాలేకపోయాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

To Top
error: Content is protected !!