సినిమా

సంక్రాంతి యుద్ధంలో గెలిచి నిలిచినా మగధీరుడు….!

సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఇక సంక్రాంతికి తిరుగులేని రికార్డ్స్ ఉన్న నందమూరి బాలకృష్ణ జై సింహా గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రి విక్రమ్ ఇంకొంచం సినిమా పై ఫోకస్ చేయాల్సింది అని కామెంట్స్ వస్తూన్నాయి అజ్ఞాతవాసికి . ఇక తమిళ దర్శకుడు కే.యస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జై సింహ మాస్ ఆర్డియన్స్ ని టార్గెట్ చేస్తూ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టిందని అంటున్నారు ప్రేక్షకులు . జై సింహకి వస్తున్నా టాక్ దృష్ట్యా సంక్రాంతి సీజన్ అయిపోయే సరికి సుమారుగా 30కోట్ల వరకు వసూల్ చేయొచ్చునని అంటున్నానరు . జై సింహ 26 కోట్ల బ్రేక్ ఈవెన్ అయింది కాబట్టి , 4కోట్లు ప్రొడ్యూసర్లకు రావొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు . ఇక అజ్ఞాతవాసి లెక్క మరోలా ఉంది . ప్లాప్ అని అభిమానులు ఒప్పుకుంటున్నా , కలెక్షన్స్ మాత్రం ఊహకు అతీతంగా ఉన్నాయి . సాధారణ జనాలు సినిమా ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాం అని చెపుతున్న క్యాటగిరి కూడా ఒకటి ఉంది . ఇలా మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు . మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల షేర్ వసూల్ చేసినట్టు చెప్తున్నారు . ఇక రెండవ రోజు ఈసినిమా 45 కోట్లతో బాక్స్ ఆఫీస్ దెగ్గర స్టడీగా నిల్చుంది . మొత్తం 140 కోట్ల బ్రేక్ బిజినెస్ జరిగిన అజ్ఞాతవాసి , ఇదే ఊపు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ దాటే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు . ఇక అజ్ఞాతవాసి బడ్జెట్ , బ్రేక్ ఈవెన్ పక్కన పెడితే , రెండు రోజుల్లోనే 100కోట్లకు పైగా కలెక్ట్ చేసిన అజ్ఞాతవాసి ఒకవైపు , సంక్రాంతి మొత్తంగా ఆడిన కూడా 30 నుండి 40కోట్లు వచ్చే అవకాశం ఉన్న జై సింహ మరో వైపు .., టాక్ పక్కన పెడితే ఈ కలెక్షన్స్ లెక్కలు చెప్పేస్తున్నాయి , సంక్రాంతి యుద్ధంలో విజయం ఎవరిదే .

To Top
error: Content is protected !!