సినిమా

సాహో టీం అడిగితే అందుకు నేను సిద్దమే.. హీరోయిన్ శ్రద్ధా కపూర్

సాహో టీం అడిగితే అందుకు నేను సిద్దమే.. హీరోయిన్ శ్రద్ధా కపూర్

`బాహుబలి` వంటి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం `సాహో`. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది.

ముంబైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి శ్రద్ధ మాట్లాడింది.`సాహో` సినిమా నాలో ఉత్సుకతను పెంచుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఓ చాలెంజ్‌. ఎందుకంటే వెంట వెంటనే హిందీ, తెలుగు భాషలు మాట్లాడాలి. అయితే నేను తెలుగు ఇంకా నేర్చుకోలేదు. స్వయంగా డబ్బింగ్ చెప్పమని నన్ను సుజిత్ అడగలేదు. ఒకవేళ నా చేతే డబ్బింగ్ చెప్పించాలని `సాహో` టీమ్ భావిస్తే అందుకు నేను సిద్ధమేన`ని శ్రద్ధ ప్రకటించింది.

To Top
error: Content is protected !!