సినిమా

ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇంత సిగ్గు అవసరమా తల్లి నీకు…. శృతిమించిన అనసూయ 

ముగ్గురు పిల్లలుఉన్నారు, ఇంత సిగ్గు అవసరమా తల్లి నీకు.... శృతిమించిన అనసూయ 

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అటు జబర్దస్త్ కామెడీషో చేస్తూనే.. వెండితెరపైన వరుస ఆఫర్స్‌తో బిజీగా మారింది. మరోవైపు ఆడియో, ప్రైవేటు ఈవెంట్లలోనూ వ్యాఖ్యాతగా మెరుస్తూనే ఉంది. అయితే ఇటీవల సోషల్ మీడియా ఈవెంట్‌కు యాంకరింగ్ చేసిన అనసూయ.. ఆ కార్యక్రమంలో భాగంగా అవార్డ్ తీసుకోవడానికి వచ్చిన భల్లాలదేవుడి గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా మారింది.  ‘రెండు అక్షరాల రానా.. తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఖజానా’.. రానా స్టేజ్ పైకి వస్తే చాలా అడుగుదాం అనుకున్నా కాని ఆయన స్టేజ్ మీదకు వచ్చేసరికి నాకు ఎక్కడలేని సిగ్గు వచ్చేసింది. నాలోని సిగ్గు మొగ్గలేసింది కనుకనే స్టేజ్ వెనక్కి వెళిపోయా అంటూ, శృతి మించిన మాటలతో ,  స్టేజ్‌పై తెగ సిగ్గు పడిపోయింది హాట్ యాంకర్ అనసూయ.

ఇక ఈ కార్యక్రమం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ -2017 ప్రదానోత్సవం కార్యక్రమాన్ని విజయవాడలో ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చురుగా ఉన్న ప్రముఖులకు అవార్డుల్ని ప్రదానం చేశారు .

ఈ సందర్భంగా మాట్లాడిన రానా.. తక్కువ పనిచేస్తూ.. ఎక్కువ సోషల్ మీడియాలో పాపులర్ అయినందుకు నాకు ఈ అవార్డ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలను విజయవాడలో ఏర్పాటు చేసినందుకు స్పెషల్ థాంక్స్ అన్నారు రానా.

To Top
error: Content is protected !!