సినిమా

మహేష్ బాబు సినిమా కోసం అల్లరి నరేష్ ఇలా మారాడు.

మహేష్ బాబు నటించనున్న కొత్త సినిమా కోసం హీరో అల్లరినరేష్ తన శరీర ఆకృతిని మార్చేసుకున్నాడట. అదేంటి మహేష్ సినిమా కోసం నరేష్ మారడమేంటి అనుకుంటున్నారు కదూ.. అసలు విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తికాగానే మహేష్ బాబు- వంశీ పైడిపెల్లి కాంబినేషన్‎లో మరో సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో అల్లరి నరేష్ కూడా నటించనున్నాడని సమాచారం.ఇదిలా ఉంటే ఎప్పుడూ సన్నగా కనిపించే నరేష్.. ఇటీవల ఓ కార్యక్రమంలో కాస్త బొద్దుగా దర్శనమివ్వడంతో ఇప్పుడది టాలీవుడ్‎లో ఓ చర్చగా మారింది. మహేష్ కోసమే అల్లరినరేష్ ఇలా బొద్దుగా తయారవుతున్నాడని చర్చించుకుంటున్నారు. మహేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడని, ఆ పాత్రలో ఈయన కాస్త లావుగా కనిపించాల్సిన అవసరం ఉండటం కారణంగానే ఈ అల్లరోడు బొద్దుగా మారుతున్నాడంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

To Top
error: Content is protected !!