కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
సినిమా

బిగ్‌బాస్: భర్తపై ముద్దుల వర్షం కురిపించిన హరితేజ

hari teja husband
బిగ్‌బాస్: భర్తపై ముద్దుల వర్షం కురిపించిన హరితేజ

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇప్పటికి 60 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. 14 మంది కన్టెస్టెంట్స్‌తో జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ జర్నీ 60 ఎపిసోడ్‌కి వచ్చేసరికి కేవలం ఆరుగురు మంది కన్టెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో ఇద్దరు నవదీప్, దీక్షలు షో మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ప్రారంభం నుండి ఉన్న కన్టెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిలో దీక్ష కంటే నవదీప్ టైటిల్ పోరులో ముందంజలో ఉండగా.. హరితేజ ఓటింగ్‌లో దూసుకుపోతుంది. ఇక 60 ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్‌లో లగ్జరీ బడ్జెట్‌ కోసం జరిగే పోరు ఎప్పటిలా కాకుండా ఈవారం చాలా ఫన్నీగా… ఎమోషన్స్ మేళవించి ‘నా మాటే శాసనం’ అంటూ బిగ్ బాస్ వెరైటీ టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ప్రకారం ఏం చెప్తే అది చేయాలని ఏ సమయంలో.. ఎక్కడ ఎలాంటి పరిస్థితులల్లో ఉన్నా రూల్స్‌ని అతిక్రమించరాదని .. స్లో మోషన్, రివైండ్, ఫార్వర్డ్, ఫ్రీజ్ లాంటి అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు వాటిని విధిగా పాటించాలన్నారు. ఇక ఈ గేమ్‌ను మరింత రక్తికట్టించేందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి కన్టెస్టెంట్స్ ఫ్యామిలీలను రంగంలోకి దింపగా నిన్నటి ఎపిసోడ్‌లో శివబాలాజీ భార్య, ఆదర్శ్ భార్య, కొడుకు రాగా… ఈరోజు ఎపిసోడ్‌లో అర్చన తల్లి హౌస్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ టైంలో ఫ్రీజ్‌లో ఉండిపోయిన అర్చన తన తల్లిని చూడగానే ఆనందంతో పొంగిపోయి గేమ్‌ను పక్కన పెట్టి తల్లిని కౌగిలించుకుని ఆనందంతో ఏడ్చేసింది.ఇక బిగ్ బాస్ హౌస్ అల్లరి పిల్ల హరితేజ కోసం ఎవరు వస్తారని ఎదురు చూస్తుండగా… హరితేజను బిగ్‌బాస్ స్టోర్ రూంకి వెళ్లమని ఆదేశించారు. దీంతో స్టోర్ రూంకి వెళ్లిన హరితేజ అక్కడ తన భర్తను చూసి షాక్ అయ్యింది. ఒక్కసారిగా ఆనందంతో పరవశించిపోయి భర్తను గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తింది. ఆ టైంలో బిగ్ బాస్ ‘నా మాటే శాసనం’ అంటూ ఫ్రీజ్, రివైండ్, ఫార్వర్డ్, స్లో మోషన్ అంటూ హరితేజతో ఆటాడేశాడు. ఇక హరితేజ భర్త మిగిలిన హౌస్ మేట్స్‌తో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. ముఖ్యంగా శివబాలాజీని ఉద్దేశించి నా భార్యను కొట్టింది నువ్వే కదా అంటూ కన్నడ భాషలో ఆటపట్టించాడు.

ఈ గేమ్ సంగతి అటుంచితే హౌస్‌లో వివాదంగా మారిన దీక్ష-నవదీప్‌ల మధ్య చిన్న వివాదం రేగడంతో నవదీప్ ఓపెన్ అయిపోయాడు. హౌస్ మేట్స్ అందరూ కావాలనే తనని నామినేట్ చేస్తున్నారంటూ దీక్ష ఆరోపించగా… నువ్ నీ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావని ఎవరికీ నీకోసం ఆలోచించాల్సిన అవసరం లేదంటూనే నీ కంత సీన్ లేదు అంటూ ముఖం మీద కుండబద్దలుకొట్టేశాడు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!