సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది…!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలో వారణాసిలో చివరి షెడ్యూల్ని జరుపుకోనుంది.
ఈ సినిమాలో పవన్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ విడుదలవుతుందని భావించిన ఫ్యాన్స్కి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. వచ్చే నెల 15వ తేదీన ఆడియోను అమరావతిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను వదిలారు. లిరికల్ వీడియో రూపంలో పలకరించిన ఈ సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది. యూట్యూబ్ లో మొదటి 8 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న ఈ సాంగ్, ప్రస్తుతం మూడున్నర మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.

To Top
error: Content is protected !!