సినిమా

నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.

నయనతార పారితోషకంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.

‘హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషికం తక్కువ కదా.. దీనిపై మీ అభిప్రాయమేంటి’.. ఓ మోస్తరు స్థాయి ఉన్న ప్రతి కథానాయికకూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్న ఎదురవకమానదు. వాళ్లు దానికి బదులివ్వకా తప్పదు. కొందరు ఈ విషయంపై తేలిగ్గా స్పందిస్తే.. ఇంకొందరు ఆవేదన స్వరంతో మాట్లాడతారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ప్రశ్నకు మధ్యస్తంగా సమాధానం చెప్పింది. తాను తన కష్టానికి తగ్గట్లు పారితోషికం అందుకుంటున్నానని చెబుతూనే.. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు దక్కుతున్నది చాలా తక్కువ మొత్తమే అని ఆమే అభిప్రాయపడింది.             హీరోయిన్లు ఎంత స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ.. పారితోషికం విషయంలో మాత్రం ఎదుగుదల లేదని రకుల్ అభిప్రాయపడింది. తమిళ హీరోయిన్ నయనతార సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందని.. కానీ ఆమె పారితోషికం రూ.3 కోట్లు మించలేదని.. అదే దక్షిణాదిన చాలామంది స్టార్ హీరోలకు రూ.15 కోట్లు.. అంత కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతోందని రకుల్ చెప్పింది. ఈ వివక్ష పోవాలని.. హీరోయిన్లకు కూడా పారితోషికం పెరగాలని రకుల్ అంది. ఐతే తాను మాత్రం ఈ పోలికల గురించి ఎక్కువ ఆలోచించకుండా తన కష్టానికి తగ్గట్లు పారితోషికం అందుకుంటున్నానా లేదా అన్నదే చూస్తున్నానని.. తనకు దక్కుతున్న దాంతో సంతృప్తి చెందుతున్నానని ఆమె చెప్పింది.

To Top
error: Content is protected !!