సినిమా

త్రిష బాత్ రూమ్ వీడియోపై రాజశేఖర్ ఫైర్ ….!

rajashekar and trisha
త్రిష బాత్ రూమ్ వీడియోపై రాజశేఖర్ ఫైర్ ....!

దశాబ్దం కిందట త్రిష పేరుతో బయటికి వచ్చిన బాత్ రూం వీడియో క్లిప్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియా అంతగా ఊపులో లేని సమయంలోనే ఆ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది ఫేక్ క్లిప్ అంటూ త్రిష మీడియా ముందుకొచ్చి ఏడ్చింది కూడా. కొన్నేళ్ల తర్వాత అందరూ ఆ విషయం మరిచిపోయారు. ఐతే సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు ఆ క్లిప్ గురించి మాట్లాడారు. సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్లపై రాజశేఖర్ మండిపడ్డాడు. త్రిష బాత్ రూం క్లిప్ అని.. తారా చౌదరి వీడియో అని.. రష్మి గురించి రూమర్ అని.. యూట్యూబ్ ఛానెళ్లలో పిచ్చి పిచ్చి హెడ్డింగులు పెట్టి డబ్బుల కోసం కొందరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని రాజశేఖర్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో మండిపడ్డాడు. తన గురించి కూడా ఇలాంటి కొన్ని రూమర్లు వచ్చాయని.. తాను చాలా ఇబ్బంది పడ్డాడనని రాజశేఖర్ అన్నాడు.
రాజశేఖర్ పక్కనే ఉన్న జీవిత కూడా ఈ విషయమై స్పందించింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి డబ్బులు సంపాదించడం కన్నా శవాల మీద చిల్లర ఏరుకోవడం మేలని ఆమె అన్నారు. తారా చౌదరితో తనకు సంబంధం ఉన్నట్లుగా మీడియాలో ఇంతకుముందు ప్రచారం జరిగిందని.. అదంతా శుద్ధ అబద్ధమని.. అలాంటిదేమైనా ఒప్పుకోవడానికి తనకు అభ్యంతరం లేదని.. పెళ్లికి ముందు తనకు కొన్ని ఎపైర్లు ఉన్న మాట వాస్తవమని రాజశేఖర్ చెప్పడం విశేషం.

To Top
error: Content is protected !!