సినిమా

జూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..

జూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..

సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ ‘జూలీ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్లో తొలి
ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది.ఇప్పుడు ఈ చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని మీడియా ముందుకొచ్చి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.

ఈ చిత్రం ఓ మాజీ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాడు. ఆమె పేరు బయటపెడితే.. తమకు లీగల్ సమస్యలు తప్పవని.. సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు.అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు. అయితే పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ కలిపి చూసినవాళ్ళంతా ఆ కథ ఒకప్పటి సౌథ్ గ్లామర్ హీరోయిన్ నగ్మా అనే అనుకున్నారు. అసలు అలా అనుకోవాలన్నదే పహ్లజ్ ఉద్దేశమేమో అన్నది కూడా ఒక టాక్ .

“1990-2000 మధ్య కాలంలో సౌత్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ కెరీర్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సౌత్ లో పెళ్లయిన ఓ సూపర్ స్టార్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఆ వివరాలతో పాటు సౌత్ నుంచి ఆమెను ఎలా బయటకు పంపించారు. తర్వాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది లాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.” జూలీ-2 సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెబుతున్న మాటిది.ఆయన నగ్మా పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆ కథ నగ్మాదే అంటూ ఒక టాక్ బయల్దేరింది. ఈ సినిమా ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఓ తారామ‌ణి క‌థ అని ప్ర‌క‌టించాడు. అయితే ఆమె పేరు వెల్ల‌డించ‌లేదు. అయినా ప‌హ్లాజ్ ప‌రోక్షంగా మాట్లాడింది న‌గ్మా గురించే అని క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

To Top
error: Content is protected !!