సినిమా

జీవిత రాజశేఖర్ ఇంట్లో గందరగోళం…, రాత్రికిరాత్రి ఇల్లు తాకట్టు…!

PSV_Garuda_Vega_movie
జీవిత రాజశేఖర్ ఇంట్లో గందరగోళం…, రాత్రికిరాత్రి ఇల్లు తాకట్టు…!

దాదాపు పదేళ్ళ పాటు ఒక్క సక్సెస్ కోసం ఎదురు చూసాడు సీనియర్ హీరో.. దాదాపు పదేళ్ళ కిందట వచ్చిన “ఎవడైతే నాకేంటీ” తప్ప ఆ స్థాయి హిట్ ఒక్కటికూడా లేదు. అయినా నిరాశ పడలేదు.. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే గానీ ఒక వేళ ఏమాత్రం తేడా చేసినా ఈసారి కూడా రాజశేఖర్కి మళ్ళీ మూడుకోట్లకు పైగా నష్టం వచ్చేదట. విడుదలకు ముందు రోజు సినిమా ఫైనాన్స్ క్లియర్ చేసి, లెటర్ తీసుకోవడానికి జేజెమ్మ దిగి వస్తుంది.. . గరుడ వేగ సినిమా కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. గరుడ వేగ మంచి సినిమా అని తెలుసు. ట్రయిలర్, టీజర్ బాగున్నాయి అని తెలుసు. కానీ అమ్మకాలు జరగలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటి వరకు ఈ తరహా సినిమాలు తీయకపోవడం, రాజశేఖర్ నటించి చాలా కాలం కావడం వంటి కారణాలు వున్నాయి. సినిమాను ఆంధ్రలో సురేష్ మూవీస్ దగ్గర, సీడెడ్ లో సాయి కొర్రపాటి దగ్గర వుంచారు. నైజాంలో మర్కాపురం శివకుమార్ కోటి రూపాయిల అడ్వాన్స్ పై ఆడిస్తా అన్నారు. కానీ మరి ఈ మూడు కోట్ల ఫైనాన్స్ క్లియరెన్స్ ఎలా? థియేటర్ల అడ్వాన్స్ లు ఇలాంటివి ట్రయ్ చేసారు కానీ కాలేదని వినికిడి. ముందురోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంత ప్రయత్నించినా క్లియరెన్స్ రాకపోవడంతో.. చివరకు మంచి పోష్ ఏరియాలోని తన 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను తాకట్టు పెట్టి మరీ 3 కోట్ల ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాడట. కానీ ఇప్పుడు మూవీకి మంచి టాక్ వచ్చింది. ఇంకా శాటిలైట్ హక్కులు విక్రయించాల్సి ఉండడం.. మూవీకి మంచి కలెక్షన్స్ కంటిన్యూ అవుతుండడంతో.. త్వరలోనే తన ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తన ఫ్లాట్ తిగి వస్తుంది అది వేరే విషయం గానీ ఒక్క సినిమాని బయటికి తేవాలనుకుంటే నిర్మాతలు పడే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి ఇదే పెద్ద ఉదాహరణ.

To Top
error: Content is protected !!