సినిమా

కత్తి మహేష్ తండ్రి ని కలసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

pawan kalyan should be vice president says kathi mahesh
కత్తి మహేష్ తండ్రి ని కలసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

కత్తి మహేష్ అంటే ఎవరు..అతని పుట్టుపూర్వోత్తరాలేంటి..అతని తండ్రి ఎవరు..? ఇవీ గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ గురించి తీస్తున్న ఆరాలు. ఎలా అయితేనేం, ఆ వివరాలన్నీ సంపాదించిన ఫ్యాన్స్, ఇప్పుడు ఆ కుటుంబసభ్యుల్ని కలిసి, కత్తి మహేష్ తీరును మార్చుకునేలా చేయాలని చెబుతున్నారు. తిరుపతి, మదనపల్లె నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ తండ్రిని కలిశారు.

యర్రావారి పాలెం మండలంలో మారుమూల గ్రామమైన యల్లమంద పంచాయితీకి చెందిన బాలవారిమాదిగల్లెకు చెందిన కత్తి ఓబులేషు, రెడ్డిసరోజు దంపతులకు కత్తి మహేష్ జన్మించారు. ఓబులేషు అగ్రికల్చరల్ ఏఈవోగా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఓబులేషు దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం కాగా అందులో ఇద్దరు మగపిల్లలు. ఒక అమ్మయి. వీరిలో కత్తి రవికుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. కత్తి మహేష్ సోదరి పేరు ధన్యా మీనా. ఇక మూడవకుమారుడు కత్తి మహేష్. మహేష్ ఎం ఏ మ్యాథ్స్ కమ్యూనికేషన్ చేశారు. ఆయనకు సోనాలి అనే ఆమెతో పెళ్లై, ముకుంద, అవినాష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇవీ, కత్తి మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన షార్ట్ డిటెయిల్స్.

ఇక ఈ వివరాలన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ ను కలుసుకుని, మహేష్ తన ప్రవర్తనను మార్చుకోవాలని, పవన్ పై అతను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, అందుకు ఓబులేష్ ఏమాత్రం ఒప్పుకోలేదు. తన కుమారుడి అభిప్రాయం పూర్తిగా అతని వ్యక్తిగతమైనవని, దానికి తాను ఏం చేయగలనని ఆయన అన్నారు. ఇలాంటి బెదిరింపులు కరెక్ట్ కాదని, కత్తి మహేష్ కు తమ ఊరు, ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల సపోర్ట్ ఉందని, ఎవరి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని ఓబులేష్ పవన్ అభిమానులకు స్పష్టం చేశారు. కత్తి మహేష్ సైతం, తన కంటే తన తండ్రి మరింత బలమైన ఆలోచనలు కలవారని, మొండివాడని, ఆయన్ను కలిసినా పవన్ ఫ్యాన్స్ కు ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు.

కత్తి మహేష్ తండ్రి ని కలసిన పవన్ కళ్యాణ్ అబిమానులు పై కత్తి తన ట్విట్టర్ లో
మా పల్లెకొచ్చి. మా ఇంటికొచ్చి. మా నాన్నను “మర్యాద పూర్వకంగా” కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకొచ్చింది? అదే మా ఇల్లు మావాళ్ళు ఉండే పల్లెలోకాకుండా ఏ టౌన్ లోనో, ఒంటరిగా అయ్యుంటే? అని పేర్కొన్నాడు ..

To Top
error: Content is protected !!