సినిమా

అమీర్‌ఖాన్ మహాభారతం..రాజమౌళికి షాక్

అమీర్‌ఖాన్ మహాభారతం...రాజమౌళికి షాక్

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు మహాభారతం చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. కానీ మహాభారతం చిత్రం ఇప్పుడే తీయలేను. కానీ ఆ చిత్రాన్ని తప్పుకుండా తెరకెక్కిస్తాను అని జక్కన్న వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అదే మహాభారతాన్ని అమీర్‌ఖాన్ తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం బాలీవుడ్‌లో ఓ సంచనల కథనం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే రాజమౌళి ప్రయత్నాలకు అమీర్‌ఖాన్ గండికొట్టినట్టే. ప్రస్తుతం అమీర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తైన తర్వాత మహాభారతం సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు తెలిసింది. అందుకోసమే రాకేశ్‌శర్మ చిత్రాన్ని వదులుకొన్నారట. పక్కా ప్లానింగ్‌తో అమీర్ ఖాన్ ఈ చిత్రం కోసం అమీర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారనేది బాలీవుడ్ పత్రికల కథనం. అంతేకాకుండా డబుల్ రోల్‌లో ఆయనకు ఇష్టమైన కృష్ణుడు, కర్ణుడిగా సిద్ధమవుతున్నాడట. దర్శకుడు రాజమౌళి మహాభారతాన్ని రూపొందిస్తే తనకు కృష్ణుడి పాత్రను పోషించాలని ఉంది అని మనసులో మాటను అమీర్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా రాజమౌళికి ముందే అమీర్‌ఖాన్ మహాభారతం రూపొందించడం జక్కన్నకు దెబ్బే. ఎందుకంటే ఒకసారి మహాభారతాన్ని అమీర్ తెరకెక్కించడం ప్రారంభమైతే.. మరో ఏడేళ్లు రాజమౌళి ఆగాల్సిందే. అప్పటి సినిమా పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది ఊహించడం కష్టమే కదా.. ఎన్టీఆర్, చెర్రీతో జక్కన్న మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ చిత్రాన్ని నభూతో నభవిష్యత్‌గా తెరకెక్కించడం నా లక్ష్యం అని చెప్పే రాజమౌళి ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మించే మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

To Top
error: Content is protected !!