సినిమా

అనుష్క అడ్డంగా బుక్ అయింది.., అంత గ్రాఫిక్స్ ఏనా …!

anushka
అనుష్క అడ్డంగా బుక్ అయింది.., అంత గ్రాఫిక్స్ ఏనా ...!

సైజ్ జీరో కోసం బాగా బరువెక్కిపోయిన అనుష్క అప్పట్నుంచి సన్నబడేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంది అనుష్క. అయితే ఆమె.. ఏ మాత్రం సన్నబడలేదు. కాస్తో కూస్తో తగ్గింతే తప్ప మునుపటిలాగ  స్లిమ్ గా అయితే కాలేకపోయింది. దీంతో చిత్ర బృందాలు ఆమెను సన్నగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి కొన్ని కోట్లు పెట్టి మరీ ఆమెను గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించగలిగారు.
అయితే, భాగమతి యూనిట్ కూడా బాహుబలి యూనిట్‌ను ఫాలో కావాలని ట్రై చేసింది. బాహూబలి టీమ్లాగానే అనుష్కను స్లిమ్ గా చూ పించాలని ట్రై చేశారు. బ్యాడ్ ఫోటోషాప్ డిజైన్ తో అడ్డంగా బుక్కయ్యారు. పోస్టర్ మొత్తం చూస్తే కాస్త ఇంట్రస్టింగ్‌గానూ.. ఇంకాస్త భయం కలిగించేలా ఉంది.. కానీ ఒక్క చోటా మాత్రం తేడా కొట్టింది. అదే అనుష్క నడుము భాగం. అనుష్క బాగా లావుగా ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా భాగమతి చిత్ర బృందం అనుష్కను సొగసైన నడుమొంపుతో చూపించాలని ఫోటోషాప్తో డిజైన్ చేయించింది. పోనీ దాన్ని సరిగ్గా చూపించారా? అంటే అదీ లేదు. ఆమె నడుమును కుచించుకుపోయేలా డిజైన్ చేశారు. కావాలంటే మీరూ దగ్గర్నుంచి గమనించండి స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్ బాగా చూపించాలనే ఉద్దేశం ఉండటంలో తప్పులేదు కానీ.. మరీ ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా? ఈ తప్పు చేసినందుకు సోషల్ మీడియాలో భాగమతి యూనిట్‌ను నెటిజెన్లు ఓ రేంజ్లో దుమ్మెత్తి పోస్తున్నారు

To Top
error: Content is protected !!