ఆంధ్ర ప్రదేశ్

‘కేసీఆర్’… అడుగుజాడల్లో ‘ఏపీ సీయం చంద్రబాబు’!

increasing of assembly seats
'కేసీఆర్'... అడుగుజాడల్లో 'ఏపీ సీయం చంద్రబాబు'!

కొన్ని నిర్ణయాలు మంచివైనా సరే.. ఎందుకో చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా… ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కూడా.. ఇలాగే కొత్త చర్చకు కారణమైంది. అది.. పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో అమలు చేయబోతున్న పథకమే అన్న మాట.. వినిపిస్తోంది.ఇప్పటికే.. తెలంగాణలో వితంతువులతో పాటు… ఒంటరి మహిళలకూ (వివాహమైన తర్వాత విడాకులు తీసుకున్నవారు, భర్తతో విడిపోయి ఉంటున్నవాళ్లు) పెన్షన్లు ఇస్తున్నారు.ఇప్పుడు ఆంధ్రాలో కూడా.. ఇలాగే భర్త నుంచి విడిపోయి బతుకుతున్నవారికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇన్నాళ్లూ ఒంటరి మహిళలపై లేని ప్రేమ.. ఇప్పుడే సడన్ గా చంద్రబాబుకు ఎందుకు పుట్టుకొచ్చిందా అన్న చర్చ మొదలైంది. మిగిలిన వర్గాలకు ఇస్తున్నట్టే.. వారికి కూడా గతంలోనే పెన్షన్లు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు ఈ అపవాదు మూటగట్టుకుని ఉండేవారు కాదు కదా.. అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయినా సరే.. నిర్ణయం మంచిదే కాబట్టి సక్రమంగా అమలు చేయాలని.. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తే బాగుంటుందని ప్రజలు చెబుతున్నారు.ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. ఈ పథకం గురించి జనానికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు.

To Top
error: Content is protected !!