ఆంధ్ర ప్రదేశ్

వైకాపా అభ్యర్థి ఆమంచిపై కేసు నమోదు

Case Filed On YCP Candidate Amanchi
వైకాపా అభ్యర్థి ఆమంచిపై కేసు నమోదు

ప్రకాశం జిల్లా చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్‌పై కేసు నమోదైంది. తమ విధులకు ఆటంకం కల్గించారని పేర్కొంటూ చీరాల గ్రామీణ సీఐ ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఈరోజు ఉదయం కార్యకర్తలతో ఆమంచి సమావేశం ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అనుమతి లేదని చెప్పారు.

తమ పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశం నిర్వహిస్తుంటే పోలీసులు రావడం ఏంటని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు, ఆమంచి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటుకు, మైకు పెట్టుకొనేందుకు ఎలాంటి అనుమతిలేదని పోలీసులు స్పష్టంచేశారు.

ఈ క్రమంలోనే ఆమంచి తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ చీరాల రూరల్‌ సీఐ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఆమంచి స్పందిస్తూ.. బూత్‌ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశానని, పోలీసులు అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

To Top
error: Content is protected !!