పాపాలు చేసే వారికే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌...అసోం మంత్రి షాకింగ్ కామెంట్స్.....!!పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??
వ్యాపారం

సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ.. లాభాల్లో మార్కెట్?

sensex double century
సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ.. లాభాల్లో మార్కెట్?

దేశీయ స్టాక్ మార్కెట్ ఆరంభంలోనే రికార్డ్‌ స్థాయిలో కొన‌సాగుతొంది. ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ పాయింట్లతో లాభాల్లో దూసుకెళుతోంది. 234 పాయింట్లు జంప్‌చేసి 31 వేల 595 మార్క్ ను దాటింది. తద్వారా మార్కెట్‌ చరిత్రలో సెన్సెక్స్‌ మరోసారి కొత్త గరిష్టాన్ని అందుకుంది. అలాగే 9732 వద్ద నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు చేసింది. అనంతరం స్వల్పంగా వెనుకంజ వేసింది. అయితే మార్కెట్‌ ప్రారంభంలో ఎన్‌ఎస్‌ఈ రేట్లు అప్‌టేడ్‌ కావడంలో తలెత్తిన సాంకేతిక సమస్య కొంత గందరగోళం నెలకొంది. సెన్సెక్స్‌ 195 లాభంతో 31 వేల 556 వద్ద న‌మోదుకాగా.. నిఫ్టీ 22 పాయింట్లు ఎగబాకి.. 9 వేల 687వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్నిరంగాలూ లాభాల్లోనే కదులుతున్నాయి. బ్యాంకింగ్‌ నిఫ్టీ, మెటల్‌, ఆటో సెక్టార్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకుల ర్యాలీని మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి. ఐటీ కూడా స్వల్పంగా లాభపడుతోంది. అలాగే మెగా మెర్జర్‌ను ప్రకటించిన ఐడీఎఫ్‌సీ, శ్రీరామ్‌ షేర్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. లుపిన్‌, టాటా మోటార్స్‌,ఐటీసీ, టాటా స్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టీసీఎస్‌ భారీగా లాభపడుతుండగా బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం నష్టాల్లో కొనసాగుతున్నాయ‌ని మార్కెట్ నిపుణుల అంచ‌నా.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!