పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??
వ్యాపారం

సంచలనం…రూపాయికే రెడ్‌‌మీ 4A !

చైనా మొబైల్ మేకర్ షియోమీ ఎంఐ బ్రాండ్‌ను మన దేశంలో ప్రారంభించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 20, 21 తేదీల్లో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఫ్లాష్ సేల్ ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించనున్నట్టు షియోమీ పేర్కొంది. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో ఇటీవల లాంచ్ చేసిన రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచుతామని చెప్పింది. అలాగే యాక్సెసరీలపై రాయితీలు కూడా ఇస్తుందట. కొత్త పవర్ బ్యాంకులను అందుబాటులోకి తీసుకురానుంది.
వీటితోపాటు రూపాయికే ఫ్లాష్ సేల్ ప్రారంభించనుంది. ఫ్లాష్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మీ 4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్2 తదితర వాటిని రూపాయికే పొందవచ్చంటూ బంపరాఫర్ ఇచ్చింది. గోఇబిబో ద్వారా దేశయంగా హోటల్స్ బుక్ చేసుకుంటే రూ.2వేల డిస్కౌంట్ ఇస్తున్నట్టు పేర్కొంది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 5శాతం క్యాష్ బ్యాక్, రూ.8వేలకు పైన కొనుగోలు చేసే వారికి ఒక్కో కార్డుపై రూ.500 వరకు క్యాష్ ఇవ్వనున్నట్టు షియోమీ పేర్కొంది. ఈనెల 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టాక్ అయిపోయే వరకు ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి ఉంచనున్నారు. అలాగే రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4, రెడ్‌మీ 4ఏలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ఇయర్ ఫోన్లు, సెల్పీ స్టిక్‌లు, వీఆర్ ప్లేలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!