పాపాలు చేసే వారికే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌...అసోం మంత్రి షాకింగ్ కామెంట్స్.....!!పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??
నేషనల్

వెబ్, యాప్ డిజైన్ టెక్నిక్ లు ఉచితంగా నేర్చుకోవాలని ఉందా? అయితే ఈ న్యూస్ మీకోస‌మే..?

వెబ్, యాప్ డిజైన్ టెక్నిక్ లు ఉచితంగా నేర్చుకోవాలని ఉందా? అయితే ఈ న్యూస్ మీకోస‌మే..?

వేల‌కు వేలు డ‌బ్బులు పోస్తేగాని.. వెబ్, యాప్ తయారీకి సంబంధించిన కోర్సులు, సాఫ్ట్ వేర్ లు, ప్రోగ్రామింగ్ లు నేర్చుకోలేరు. అలాంటిది ఉచితంగా యాప్ ను ఎలా డిజైన్ చేయాలి? ఎలా ర‌న్ చేయాలి? అన్న విష‌యాల‌పై ఫ్రీ కోచింగ్ ఇస్తానంటే ఎవ‌రైనా క్యూ క‌డ‌తారు. రాజోషి స్థాపించిన హసురా అనే సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెన్సీ, డెవలప్‌మెంట్‌ సంస్థ ఈ ఉచిత‌ శిక్షణ ఇస్తోంది. ఐఐటీ-మద్రాసు భాగస్వామ్యంతో ఆమె దీన్ని నిర్వహిస్తోంది. ఆ సంస్థకి చెందిన ప్రొఫెస‌ర్లు, హసురా సంస్థ‌ నిపుణులూ ఇందులో పాఠాలు చెబుతారు గత సెప్టెంబరులో తొలిసారి, జనవరిలో మలిసారి ఈ కోర్సు నిర్వహించింది. దేశవిదేశాల నుంచి 83 వేల మంది ఇందులో పాల్గొన్నారు. జులై 24 న మ‌రో విడ‌త ఈ కోర్స్ ను ఉచితంగా నేర్పేందుకు సిద్ద‌మ‌వుతోంది రాజోషి ఘోష్. ప్రస్తుతం యాప్‌ తయారీకి వాడుతున్న ఏపీఐ(అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌)లు క్లిష్టంగా ఉండటం ఓ కారణమనుకున్నారు. తామే సొంతంగా అలాంటి ఏపీఐ ఒకటి రూపొందించారు. దాని పేరు procrust.es. దాంతోనే తమ సొంత వెబ్‌సైట్‌, యాప్‌లు తయారుచేయడం మొదలుపెట్టారు. రాజోషీ, తన్మయీ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌లుగా మారిపోయారు. అతిసులువుగా యాప్‌లూ, వెబ్‌సైట్‌లు చేసే మూసల్లాంటి ఏపీఐలని విక్రయించడం మొదలుపెట్టారు! హసురా అనే సంస్థని స్థాపించారు. ఏ పెట్టుబడి లేకుండా మొదలైన ఈ సంస్థ మూడేళ్లలోనే కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తోంది ఇప్పుడు. అయితే ఈ సులువైన సాంకేతిక ప‌ద్ద‌తిని అంద‌రికీ అందించాల‌నే ఉద్ధేశ్యంతో.. సాంకేతికతని అందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో.. ఎవరికి వారే యాప్‌ తయారు చేసుకోవాలని భావించి వాళ్ల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. వీళ్ల‌ సాంకేతికతను వీలున్నంత ఎక్కువమందికి చేరేలా హసురా-ఎడ్యుకేషన్‌ పేరుతో ఐఎంఏడీ కార్యక్రమం ద్వారా ఉచితంగా శిక్ష‌ణ ఇస్తున్నామంటోందామె. ఆసక్తి ఉన్నవారు www.imad.tech వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ పేరూ, వివరాలూ నమోదుచేసుకోవచ్చని తెలియ‌జేసింది ఘోష్.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!