కుకరీ

మీ సబ్బులో స్టీల్ ఉందా..? అరగని..కరగని సోప్ వచ్చేసిందోచ్..!

మీ సబ్బులో స్టీల్ ఉందా..?
అరగని..కరగని సోప్ వచ్చేసిందోచ్..!

మీ సబ్బులో స్టీల్ ఉందా…ఆ ఏంటీ సబ్బులో స్టీలా…కామెడీనా..? అనుకోకండి..మీరు చదివింది నిజమే…మేము అడిగింది స్టీలే..ఉప్పు కాదు…ఎస్..ఈ ప్రశ్న కామెడీ కూడా కాదు..ఆమ్ కో కంపెనీ సీరియస్ గా అడుగుతున్న ప్రశ్న…ఉల్లి, వెల్లుల్లి కట్ చేసిన తర్వాత…చికెన్ , మటన్ లొట్టలేసుకుని తిన్న తర్వాత..చేతికంటిన ఘాటైన వాసనను పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడతాం…నిమ్మకాయ, జెల్, సోప్ ఇలా చాలానే ట్రై చేస్తాం..కానీ ఈ రబ్ అవే స్టీల్ సోప్ తో మొండి వాసనలన్నీ ఇట్టే వదిలిపోతాయంటుంది ఆమ్ కో…ఒక్కసారి కొంటే మళ్లీ మళ్లీ కొనాల్సిన అవసరం లేదంటుంది..ఎందుకంటే ఈ సబ్బు అరగదు..కరగదు..ఇది మొత్తం స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారయింది.. సల్ఫర్..నైట్రోజన్ మిశ్రమంతో రూపొందించిన ఈ స్టీల్ సోప్ ను వాటర్ లో 30 సెకెండ్లు రబ్ చేస్తే చాలు…చేతికి అంటిన ఎలాంటిదుర్గంధమైనా వదిలిపోవాల్సిందే..చాలా తేలికగా ఉండే ఈ సోప్ పనితీరులో ఎలాంటి మ్యాజిక్స్ లేవు…జస్ట్ సైన్స్..స్టెయిన్ లెస్ స్టీల్ కు వాసనలు పోగొట్టే గుణం ఉంటుంది. అదే దీని రహస్యం..ఇంతకీ దీని ధర చెప్పలేదు కదూ…ఒక్క సోప్ కేవలం 8 డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 500 వందల రూపాయలన్నమాట..ఇప్పుడు చెప్పండి మీ సోప్ లో స్టీలుందా..??

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!