నేషనల్

ప‌సిడి బాండ్ ల‌లో పెట్టుబ‌డులు లాభ‌దాయ‌కమేనా?

ప‌సిడి బాండ్ ల‌లో పెట్టుబ‌డులు లాభ‌దాయ‌కమేనా?

భార‌త్ లో బంగారం ఉన్న ప్రాధాన్య‌తే వేరు. ప్ర‌తి ఒక్క‌రూ బంగారాన్ని కొనడం ఒక అలవాటుగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్ర‌భావం చాలా ఉందంటున్నారు నిపుణులు. పసిడి దిగుమ‌తులు పెరితే.. క‌ష్ట‌మంటున్నారు. ఇది గ‌మ‌నించిన కేంద్ర ప్ర‌భుత్వం. బంగారం దిగుమతులు తగ్గించేందుకు పారదర్శకత పెంచేందుకు.. సార్వభౌమ పసిడి బాండ్లు ఉపయోగపడుతున్నాయి. నవంబరు 2015లో వీటిని తొలిసారిగా ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం 9వ విడత బాండ్లు అందుబాటులో ఉన్నాయి. జులై 10 నుంచి 14 వరకూ వీటిలో మదుపు చేసేందుకు అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పసిడి పథకాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.5వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. బంగారు ఆభరణాలపై 3శాతం జీఎస్‌టీ వర్తిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక బంగారం ఆభ‌ర‌ణాల‌ తయారీ ఖర్చులు, మళ్లీ వాటికి జీఎస్‌టీ చార్జీలు ప‌డ‌తాయంటున్నారు. అదే పసిడి బాండ్లకు ఇది వర్తించదంటున్నారు. సాధారణంగా బంగారాన్ని కొని, దాచుకుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదంటున్నారు. పైగా తొందరగా నగదుగా మార్చుకునే వీలు ఉండదు. బాండ్ల రూపంలో పసిడిలో మదుపు చేయడం ద్వారా పెట్టుబడిపై 2.5శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ బాండ్లపై వచ్చిన వడ్డీకి వర్తించే పన్ను శ్లాబులను బట్టి ఆదాయపు పన్ను చెల్లించాలి. అయితే, వ్యవధి తీరిన తర్వాత ఎలాంటి మూలధన రాబడి పన్నూ చెల్లించక్కర్లేదు. అదే బంగారాన్ని ఏ సమయంలో అమ్మినా దానిపై మూలధన రాబడి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సార్వభౌమ పసిడి బాండ్లు 999 స్వచ్ఛమైన బంగారానికి ప్రతిబింబిస్తాయి. కాబట్టి, మనం కొనే బంగారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ అక్కర్లేదు. పైగా డీమ్యాట్‌, బాండ్ల రూపంలో ఉంటుంది.. కాబట్టి, సురక్షితం కూడా. బంగారాన్ని అవసరానికి తాకట్టు పెట్టి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పసిడి బాండ్లు కూడా అందుకు వీలు కల్పిస్తాయి. నేరుగా పసిడిని కొన్నారనుకుందాం.. ధర తగ్గినా.. పెరిగినా..మీరేమీ ఇబ్బంది పడరు కదా! బాండ్ల విషయం కూడా అంతే.. ఒకవేళ బంగారం ధర పెరిగితే అందుకు అనుగుణంగా బాండు విలువ కూడా మారుతుంది. తగ్గినా అంతే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వారు.. తమ అవసరం మేరకు వాటిని తీసుకోవడమే మేలు. పెట్టుబడి లక్ష్యంతో ఉన్నవారికి ఇవి సరిపోతాయి. ముఖ్యంగా పిల్లల వివాహం సమయంలో బంగారం అవసరమైన వారు.. ఇంకా 8 ఏళ్లకు మించి సమయం ఉన్నప్పుడు వీటిని పరిశీలించవచ్చని చెబుతున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!