నేషనల్

జియో మ‌రో సంచ‌ల‌నం.. 3 నెల‌లగాను ఉచితంగా జియో ఫైబ‌ర్!

reliance jio bumper offer

జియో మ‌రో సంచ‌ల‌నం.. 3 నెల‌లగాను ఉచితంగా జియో ఫైబ‌ర్!

ఫీచర్‌ ఫోన్‌తో పాటు బ్రాడ్‌ బ్యాండు నెట్‌వర్క్‌ జియోఫైబర్‌ను కూడా రిలయన్స్‌ ఆవిష్కరించబోతుందని టాక్‌. ఈ ప్రకటన కూడా బ్రాడ్‌ బ్యాండు ఇండస్ట్రీని షేక్‌ చేయనుందని తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే కంపెనీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, అహ్మదాబాద్‌, జమ్మునగర్‌, సూరత్‌, వడోదరా వంటి ప్రాంతాల్లో జియోఫైబర్‌ ప్రీవ్యూ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్న ఈ సేవలపై జీరో రూపాయలకు 3 నెలల పాటు ప్రతినెలా 100ఎంబీపీఎస్‌ స్పీడులో 100జీబీ డేటాను జియో తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి తొలుత 4500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా తర్వాత రీఫండ్‌ చేయనున్నామని కంపెనీ అంతకముందే క్లారిటీ ఇచ్చేసింది. బ్రాడ్‌బ్యాండు సర్వీసు ధరలు కూడా 500 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసింది. 500 రూపాయలకు 600జీబీ డేటా, 2000 రూపాయలకు 1000జీబీ డేటాను 100ఎంబీపీఎస్‌ స్పీడులో జియో ఆఫర్‌ చేయనుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!