వ్యాపారం

గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్….!!

గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!

గూగుల్ నియ‌మాల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన కార‌ణంగా ప్లే స్టోర్ నుంచి నిషేధానికి గురైన ప్ర‌ముఖ మొబైల్ యాప్ యూసీ బ్రౌజ‌ర్‌… గురువారం రోజు ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అప్‌డేటెడ్ సెట్టింగ్స్‌తో వ‌చ్చిన ఈ యాప్ గూగుల్ విధివిధానాల‌కు అనుగుణంగా ఉండేలా మార్పులు చేసిన‌ట్లు యూసీ వెబ్ తెలిపింది. మొబైల్ డేటాను త‌క్కువ వినియోగించుకునేలా రూపొందించిన యూసీ బ్రౌజ‌ర్‌ను ప్ర‌స్తుతం దేశంలో చాలా మంది వినియోగిస్తున్నారు. నెల‌లో దాదాపు 100 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ యాప్ సేవ‌ల్లో భాగంగా కొన్ని పెయిడ్ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోమ‌ని ప్ర‌మోట్ చేస్తున్న కార‌ణంగా గూగుల్ ప్లేస్టోర్ దీనిపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేద‌ని, చిన్న సెట్టింగ్ లోపం కార‌ణంగా గూగుల్ త‌మ‌పై నిషేధం విధించింద‌ని, ఆ సెట్టింగ్‌ను అప్‌డేట్ చేసిన వెంట‌నే త‌మ‌ను అనుమ‌తించింద‌ని కంపెనీ వెల్ల‌డించింది.

To Top
error: Content is protected !!